Stock Market: ఒక్క స్టాక్.. 90 రోజుల్లో రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది

స్టాక్ మార్కెట్  (stock market) గురించి బాగా అవ‌గాహ‌న ఉన్న‌వారు ఇన్‌వెస్ట్ చేసి లాభప‌డుతున్నారు. అయితే ఓ వ్య‌క్తికి మాత్రం స్టాక్ మార్కెట్‌లో జాక్‌పాట్ త‌గిలింద‌నే చెప్పాలి. ఒకే ఒక్క స్టాక్.. అత‌నికి 90 రోజుల్లో రూ.25 కోట్ల లాభం తెచ్చిపెట్టింది. ఇంత‌కీ ఇత‌ని క‌థేంటో తెలుసుకుందాం. ఆశిష్ క‌చోలియా అనే వ్య‌క్తి ఇండియాలోనే టాప్ ఇన్‌వెస్ట‌ర్ల‌లో ఒక‌డు. ఇత‌ని సంప‌ద రూ.2000 కోట్లు. ఎక్కువ‌గా స్టాక్ మార్కెట్‌లో పెట్టి సంపాదించిన‌దే ఎక్కువగా ఉంది. ఈ నేప‌థ్యంలో అత‌ను మూడు నెల‌ల క్రితం బాలు ఫోర్జ్ (balu forge) అనే కంపెనీలో 2.16 శాతానికి 21,65,500 షేర్లు కొన్నాడు. ఈ షేర్ ధ‌ర రూ.115.45.

ఇప్పుడు ఈ కంపెనీ షేర్ ధ‌ర రూ.230.45 ఉంది. ఇలా మూడు నెల‌ల్లో షేర్ ధ‌ర పెరిగిపోవ‌డంతో అత‌నికి రూ.25 కోట్ల లాభం వ‌చ్చింది. ఇప్పుడు ఈ కంపెనీలో ఇత‌ని వాటా రూ.49.9 కోట్లకు పెరిగింది. బాలు ఫోర్జ్ అనే కంపెనీని బెలగావ్‌లో 1990లో ప్రారంభించారు. ఈ కంపెనీ వాహ‌నాలకు క్రాంక్ షాఫ్ట్స్ అమ్ముతుంది. అంటే వాహ‌న ఇంజిన్ల‌కు సంబంధించిన వ‌స్తువుల‌ను త‌యారుచేసి అమ్ముతుంది. ఆశిష్‌కి మొత్తం 1,01,350 కంపెనీ షేర్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌ మెళ‌కువ‌లు తెలిస్తే ఎంతో కొంత ఇలా క‌ష్ట‌ప‌డ‌కుండానే సంపాదించేసుకోవ‌చ్చు (stock market)