Mohammed Shami: వికెట్ల వీరుడి స్ఫూర్తిదాయ‌క‌మైన కొటేషన్స్..!

Mohammed Shami: మొన్న ఇండియాకి న్యూజిల్యాండ్‌కి (ind vs nz) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ కేవ‌లం సెమీ ఫైనల్ మాత్ర‌మే కాదు.. దానిని ష‌మీ ఫైనల్ అనాలి. ఆ రేంజ్‌లో ట‌క‌ట‌కా ఏడు వికెట్లు తీసిన ష‌మీకి కోట్లాది మంది అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈరోజు ఇండియా ఆస్ట్రేలియాకు (ind vs aus) మ‌ధ్య జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్ (icc world cup final match) నేప‌థ్యంలో మ‌న వికెట్ల వీరుడు ష‌మీ నుంచి కొన్ని స్ఫూర్తిదాయ‌క‌మైన కొటేష‌న్లు మీకోసం.

జ‌నాల కోసం ఆట ఆడకూడ‌దు. దేశం, టీం కోసం ఆడాలి

ఎంత బాగా ఆడాం అని కాదు..ఆట‌ కొన‌సాగిస్తున్నామా లేదా అనేదే ముఖ్యం

క్రికెట్ కేవ‌లం ఒక ఆట కాదు. ఇదొక ఎమోష‌న్

జీవితంలో ఏం జ‌రిగినా వెనుదిర‌గ‌కూడ‌దు అని నేర్పించేది క్రికెటే

ఫీల్డ్‌లో అడుగుపెట్టిన ప్ర‌తీసారి మ‌న బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మ‌న‌ల్ని ఎవ‌రు చూస్తున్నారో.. ఎవ‌రు మ‌న నుంచి స్ఫూర్తి పొందుతారో చెప్పలేం.

క్రికెట్ అయినా జీవితం అయినా నిబ‌ద్ధ‌త అనేదే మ‌న‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది

మ‌నం చేసే కృషిలోనే విజ‌యం ఉంది.. గెలుపులో కాదు.