ప్ర‌యాణికుల‌ను వ‌దిలేసి వెళ్లిపోయిన విమానం

విమానం (flight) దంప‌తుల‌ను తీసుకెళ్ల‌కుండా వ‌దిలేసి వెళ్లిపోవ‌డంతో వారు ఎయిర్‌పోర్ట్‌లోనే 24 గంట‌ల పాటు ప‌డిగాపులు కాయాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న ఇస్తాంబుల్‌లో చోటుచేసుకుంది. ముంబైకి చెందిన రాజేష్‌, ర‌ష్మి అనే వృద్ధ దంప‌తులు నిన్న లండ‌న్ నుంచి ఇస్తాంబుల్‌కు ట‌ర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన క‌నెక్టింగ్ విమానం ఎక్కారు. విమానం ఇస్తాంబుల్‌లో దిగాక అక్క‌డి నుంచి ఇండిగో విమానంలో ముంబై చేరుకోవాల్సి ఉంది. కానీ ఇండిగో విమానం వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది.

అప్ప‌టికే వారు బోర్డింగ్ పాసులు తీసుకుని బోర్డింగ్ గేట్ వ‌ద్ద ఎదురుచూస్తూ కూర్చున్నారు. రాజేష్‌కి గుండె స‌మ‌స్య ఉండ‌టంతో అత‌న్ని వీల్‌ఛైర్‌లో కూర్చోపెట్టాల్సి వచ్చింది. దాదాపు రెండు గంట‌లు అవుతున్నా స్టాఫ్ వ‌చ్చి త‌మ‌ను విమానంలోకి ఎక్కించ‌క‌పోవ‌డంతో ర‌ష్మి స్టాఫ్‌ను క‌నుక్కుంది. ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ అయ్యి అర‌గంట అవుతోంద‌ని వారు చెప్ప‌డంతో ఆ పెద్ద‌వాళ్లు ఇద్ద‌రూ కంగారుప‌డిపోయారు. వెంట‌నే బెంగ‌ళూరులో ఉన్న త‌మ కూతురికి ఫోన్ చేసారు. ఆమె ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. విమాన సిబ్బంది త‌ప్పిదం వ‌ల్ల వారిద్ద‌రూ 24 గంట‌ల పాటు ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాల్సి వ‌చ్చింది. ఆ మ‌రుస‌టి రోజు ముంబై వెళ్తున్న వేరే ఫ్లైట్‌లో వారిద్ద‌రినీ ఎక్కించి పంపించారు. (flight)