Mangoes: ఒక్క నెలలో.. 25 కోట్ల విలువైన పండ్లు కొనేసారు!
Hyderabad: మామిడి పండ్లంటే(mangoes) ఇష్టపడనివారు ఉండరు. ఇక సమ్మర్(summer) వచ్చిందంటే ఈ పండ్లకు(mangoes) ఉండే డిమాండే వేరు. అయితే.. ఈ సమ్మర్ సీజన్‌లో కేవలం ఏప్రిల్ నెలలోనే 25 కోట్లు విలువ చేసే పండ్లు అమ్ముడుపోయాయి. అది కూడా కేవలం ప్రముఖ గ్రోసరీ డెలివరీ యాప్ జెప్టోలో(zepto). ఏప్రిల్ నెలలో జెప్టో(zepto) యాప్‌లో రోజూ రూ.60 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయట. ఇంకా మే నెలలో ఈ రికార్డు కూడా బద్దలు కాబోతోందని జెప్టో అధికారులు తెలిపారు. పచ్చి మామిడి కాయలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉందని, ఏప్రిల్ నెలలో ఈ పచ్చి మామిడి సేల్స్ విలువ రూ.25 లక్షలని తెలిపారు.
జెప్టోలో ఆర్డర్ పెట్టిన మామిడి పండ్లలో ఎక్కువగా ఆల్ఫోన్సో(alphonso) మామిడి పండ్లే ఉన్నాయి. జెప్టోలో జరిగిన మామిడి సేల్స్‌లో ఆల్ఫోన్సో మామిడి సేల్స్ 30%గా నిలిచింది. ఎక్కువగా ముంబై, బెంగళూరు, దిల్లీ నుంచే ఆర్డర్లు వచ్చాయట. ఆల్ఫోన్సో తర్వాత లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బనగనపల్లి షేర్ ఎక్కువగా ఉంది. సమ్మర్‌లో మామిడి డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే.. భారతదేశానికి చెందిన 1000 మంది రైతులతో డీల్ మాట్లాడుకున్నామని జెప్టో యాజమాన్యం తెలిపింది.