China: చైనాలో వేలల్లో H9N2 కేసులు.. మనకు రిస్క్ ఉందా?
China: ఎప్పుడూ ఏదో ఒక వైరస్‌తోనో అనారోగ్య సమస్యతోనో వివిధ దేశాలకు చైనా సడెన్ సర్‌ప్రైజ్ ఇస్తుంటుంది. 2020లో కోవిడ్‌ను (covid) పరిచయం చేసిన చైనా యావత్ ప్రపంచాన్నే చిన్నా భిన్నం చేసింది. ఇప్పుడు నుమోనియా కేసులతో చైనా సతమతమవుతోంది. ఉన్నట్లుండి చైనాలో పిల్లలు నుమోనియా బారిన పడుతున్నారట. ఈ వ్యాధిని ప్రస్తుతానికి H9N2 అంటున్నారు కానీ నిజానికి ఇదో అంతు చిక్కని వైరస్ అని అంటున్నారు. దాంతో భారత్‌తో పాటు ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. సరిగ్గా పరిశోధనలు చేసి ఇది ఏం వ్యాధో ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుని తెలియజేయాలని భారత్ చైనాను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే పాటించాలని అంటున్నారు. ఊపిరితిత్తుల్లో ఏదన్నా సమస్యగా అనిపించినా.. విపరీతమైన దగ్గు.. ఆయాసం ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బయటికి వెళ్లిన ప్రతీసారి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్తున్నారు.