India vs Pakistan: ఇది మాకు ఫైనల్ ఫిట్‌నెస్ టెస్ట్ కాదు
యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. శనివారం ఏషియా కప్ 2023లో (asia cup 2023) భాగంగా భారత్ పాకిస్థాన్ (india vs pakistan) తలపడనుంది. మన బ్లూ బాయ్ ఇప్పటికే శ్రీలంకకు (srilanka) చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టేసారు. అయితే కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మొదటి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ ఉండడన్న విషయం తెలిసిందే. అసలైన వరల్డ్ కప్‌కి ముందు ఏషియా కప్ ఫిట్‌నెస్ టెస్ట్‌లాంటిదా అని కెప్టెన్ రోహిత్ శర్మను (rohit sharma) ప్రశ్నించగా.. “” అస్సలు కానే కాదు. ఈ ఏషియా కప్ మాకు ఫైనల్ ఫిట్‌నెస్ టెస్ట్ లాంటిది కాదు. ఈ టోర్నమెంట్ టాప్ 6 ఏషియన్ టీమ్స్ మధ్య జరిగేది. ఇది మాకు అతిపెద్ద టోర్నమెంట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫిట్‌నెస్ టెస్ట్‌లు, ఫిట్‌నెస్ క్యాంప్‌లన్నీ బెంగళూరులోనే అయిపోయాయి. ఇక ఆ ఫిట్‌నెస్ టెస్ట్‌ల గురించి ఆలోచించడం మానేసి టోర్నమెంట్‌లో ఏం సాధించాలో దానిపై ఫోకస్ చేయాలని అనుకుంటున్నాం “” అని తెలిపాడు. (india vs pakistan)