Harish Salve: భార‌త టాప్ లాయ‌ర్ మూడో పెళ్లి..!

ఇండియాలోనే టాప్ లాయ‌ర్ అయిన హ‌రీష్ సాల్వే (harish salve) మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. 68 ఏళ్ల హ‌రీష్‌కు ఇది మూడో పెళ్లి. 2020లో త‌న మొదటి భార్య మీనాక్షికి విడాకులు ఇచ్చి ఆ త‌ర్వాత క‌రోలినా అనే మోడ‌ల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కూడా విడిపోయి ఇప్పుడు ట్రీనా అనే మ‌హిళ‌ను చేసుకున్నారు. లండ‌న్‌లో ఘనంగా వీరి వివాహం జ‌రిగింది. వేడుక‌కు టాప్ వ్యాపారవేత్త‌లు అయిన ల‌లిత్ మోదీ, అంబానీ దంప‌తులు, సునిల్ మిట్ట‌ల్, గోపీ హిందూజా, ఎస్పీ లోహియాలు హాజ‌ర‌య్యారు. కుల‌భూష‌ణ్ జాద‌వ్ లాంటి ఎన్నో హై ప్రొఫైల్ కేసుల‌ను ఈజీగా వాదించి గెలిచిన ఘ‌న‌త హ‌రీష్ సాల్వేది. రిల‌య‌న్స్, టాటా సంస్థ‌లు హ‌రీష్‌కి క్లైంట్స్. 1999 నుంచి 2002 వ‌ర‌కు ఇండియాకు సాలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌గా హ‌రీష్ వ్య‌వ‌హ‌రించారు. (harish salve)