Cyclone: భారత్‌కు రెండు తుఫాన్ల ముప్పు
భారత్‌కు రెండు తుఫాన్ల (cyclone) ముప్పు పొంచి ఉంది. ఒకటి బంగాళాఖాతంలో (bay of bengal) ఏర్పడిన హమూన్ (hamoon) త్వరలో అల్పపీడనంగా మారనుండగా.. అరేబియన్ సమద్రంలో (arabian sea) ఏర్పడిన తేజ్ (tej) ఆల్రెడీ అల్పపీడనంగా మారిపోయిందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇలా రెండు తుఫాన్లు ఒకేసారి ఏర్పడటం అనేది 2018లో ఒకసారి జరిగిందని మళ్లీ ఇప్పుడు ఏర్పడిందని తెలిపారు.
ప్రస్తుతానికి అరేబియన్ సముద్రంలో ఏర్పడిన తుఫాన్ తేజ్ ఈరోజు మధ్యాహ్నానికి ఒమన్, యెమెన్ వైపు పయనించనుంది. ఇక హమూన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 24 కల్లా హమూన్ తీవ్ర తుఫానుగా మారనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీని వల్ల అటు తమిళనాడులోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.