Winter: ఈసారి విపరీతమైన చలి.. ఆ రాష్ట్రాల్లో మరీనూ..!
Winter: ఈసారి భారత్‌లో చలి తీవ్రత విపరీతంగా ఉండబోతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. లా నీనా ఎఫెక్ట్ కారణంగా విపరీతమైన వర్షాలు, ఎముకలు కొరికే చలి ఉండబోతోందని వెల్లడించింది. ఎల్ నినో విపరీతమైన వేడి వాతావరణానికి కారణమైతే., లా నినా చల్లటి వాతావరణానికి కారణం. ఈ తీవ్రమైన చలి అనేది మనకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌లలో సాధారణంగానే చలికాలంలో మంచు కురుస్తుంటుంది. కానీ ఈసారి ఈ లా నినా ప్రభావం వల్ల వర్షాలు పడి పంటలు కూడా చేతికి రాకుండాపోతాయి.