ఆదాయం, ట్యాక్స్.. అన్నీ ఒకే యాప్‌లో!
పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం శుభవార్త చెప్పింది. వారి సేవలను మరింత విస్తరించడంలో భాగంగా.. అదేవిధంగా పన్ను చెల్లింపుదారులు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఓ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్’ పేరుతో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఐటీ విభాగం తెలిపింది.
ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్’ పేరుతో ఉన్న యాప్‌ను ఆండ్రాయిడ్, యాపిల్ ఫ్లోన్లు వినియోగిస్తున్న వారు సైతం డౌన్‌లోడ్ చేసుకునేలా రూపొందించారు. దీన్ని యూజర్లు ఉచితంగానే వినియోగించుకోవచ్చని ఐటీ విభాగం చెబుతోంది. తొలుత ఓటీపీలతో…: ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత.. పాన్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. ఇప్పటికే మీరు ఇన్‌కంట్యాక్స్ పోర్టల్‌లో పేర్కొన్న మొబైల్ నెంబరు, ఈ-మెయిల్ వివరాలను పొందుపరచాలి. ఈ రెండింటికీ ఇన్‌కంట్యాక్స్ నుంచి ఓటీపీలు వస్తాయి. వీటిని నమోదు చేసిన నాలుగు అంకెల పిన్ ఏర్పాటు చేసుకుని.. ఇక ఆ యాప్‌ను వినియోగించుకోవచ్చు.
యాప్‌తో ఎన్నో లాభాలు..
ఈ మొబైల్ యాప్ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్- ఏఐఎస్), పన్ను చెల్లింపుదారు సమాచారం (ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ – టీఐఎస్) చూసుకునేందుకు వీలుంటుంది.
ఏఐఎస్‌లో పన్ను చెల్లింపుదారుడికి లభించిన అన్ని ఆదాయ వివరాలూ ఉంటాయి. వేతనం ద్వారా పొందిన ఆదాయం, డివిడెండ్లు, వడ్డీ, షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలు, పన్ను చెల్లింపులు, ట్యాక్స్ డిడక్షణ్ సిస్టం, పన్ను చెల్లింపు (టీసీఎస్), ఆదాయపు పన్ను రిఫండుతోపాటు జీఎస్‌టీ, విదేశీ చెల్లింపుల వంటివీ కనిపిస్తాయి. ఇందులో కనిపించే సమాచారంపై ఏమైనా ఫిర్యాదులుంటే… వాటిని కూడా స్వీకరించేలా యాప్‌లో సదుపాయాలు కల్పించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చెబుతోంది.