Viral News: ఇక్కడ భార్యలే భర్తలకు పాకెట్ మనీ ఇస్తారు..!
Viral News: ఒకప్పుడు భర్తలు సంపాదిస్తుంటే భార్యలు ఇంటి పట్టున ఉండి పిల్లల్ని చూసుకోవడం చేసేవారు. భార్యలకు ఏమన్నా కావాలంటే కూడా భర్తలే సమకూర్చేవారు. కొన్ని గ్రామాల్లో ఇంకా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు
అయితే ఈ ప్రదేశంలో మాత్రం భర్త సంపాదిస్తాడు కానీ.. అతనికి పాకెట్ మనీ మాత్రం భార్యే ఇస్తుంది. దీనిని ఓ సంప్రదాయంగా ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఇలా ఎక్కడ జరుగుతోందంటే జపాన్‌లో. జపాన్‌కి చెందిన చాలా మంది మగవారు తమ సంపాదనను తెచ్చి మొత్తం భార్యల చేతిలో పెడతారు. మొత్తం ఖర్చులన్నీ లెక్కేసాక భార్యే భర్తకు కొంత మొత్తాన్ని పాకెట్ మనీ రూపంలో ఇస్తుంది.
ఈ పద్ధతిని కోజుకాయ్ అని అంటారు. ఈ కోజుకాయ్ పద్ధతిని ఇప్పటికీ జపాన్‌లో ఫాలో అవుతున్నారు. దీని వల్ల అనవసర ఖర్చులు పెరగకుండా ఆర్ధిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటున్నారట. అయితే భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నా కూడా భర్తకు భార్యే పాకెట్ మనీ ఇచ్చే ఆచారాన్ని పాటించేవారు కూడా జపాన్‌లో చాలా మంది ఉన్నారు.