ఒక‌రు త‌ప్పు చేస్తే 3 త‌రాల వారికి శిక్ష‌..!

అన్ని దేశాల్లో చ‌ట్టాలు (law) ఒకేలా ఉండ‌వు. కొన్ని దేశాల్లో అస‌లు చ‌ట్టాలు ఇలా కూడా ఉంటాయా అనిపించేలా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు కొన్ని దేశాల్లో జీన్స్ వేసుకుంటే నేరం.. ఇంకొన్ని దేశాల్లో పావురాల‌కు తిండి పెడితే నేరం. కానీ ఎక్క‌డైనా కూడా ఎవ‌రు త‌ప్పు చేస్తే వారికే శిక్ష ప‌డుతుంది. కానీ ఈ దేశంలో మాత్రం ఎవ‌రు త‌ప్పు చేసినా వారికి సంబంధించిన మూడు త‌రాల వారికీ శిక్ష త‌ప్ప‌దు. ఇలాంటి దిక్కుమాలిన చ‌ట్టం ఏ దేశంలో ఉంది అని ఆలోచిస్తున్నారా? ఇంకెక్క‌డో కాదు.. మ‌న కిమ్ (kim jong un) గారి రాజ్యం ఉత్త‌ర కొరియాలో (north korea).

ఇలాంటి చ‌ట్టాలు ఉత్త‌ర కొరియాలో లేక‌పోతే ఆశ్చ‌ర్య‌పోవాలి కానీ ఉంటే కాదు..! అయినా కిమ్‌కి ఇదేం రోగ‌మో ఏమో.. ఎవ‌రైనా నేరం చేసార‌ని తెలిస్తే ఆ నేర‌స్థుడు లేదా నేర‌స్థురాలి పిల్ల‌లు,  తల్లిదండ్రులు, అమ్మ‌మ్మ‌, నానమ్మ తాత‌య్య‌ల‌కు కూడా శిక్ష ప‌డితీరాల్సిందేన‌ట‌. ఈ చ‌ట్టం ఎందుకు పెట్టారంటే ఏ నేరస్థుడు కూడా జైలు నుంచి త‌ప్పించుకోకుండా ఉండేందుకు. ఇక్క‌డి జైళ్లు ఎంత క‌ఠినంగా ఉంటాయంటే మ‌హిళా నేర‌స్థుల‌ను చావ‌గొడుతూ చిత్ర‌హింస‌లు పెడుతుంటారు. జైల్లోని మ‌హిళ‌ల‌ను ప‌ద్మాస‌నం వేసి కూర్చోమంటారు. వారి చేతులు మోకాళ్ల‌పై ఉండాలి. ఒక 12 గంటల పాటు క‌ద‌ల‌కుండా అలాగే కూర్చోవాలి. పొరపాటున క‌దిలితే చావ‌గొడ‌తారు. ఇక వారికి ఆహారంగా గంజి, నీరు మాత్ర‌మే ఇస్తారు.

అంతేకాదు.. ఈ నియంత పాల‌న ఉన్న దేశంలో కేవ‌లం 18 ర‌కాల హెయిర్ స్టైల్స్ మాత్ర‌మే చేయించుకోవాలి. వీటిలో 18 హెయిర్ స్టైల్స్ మ‌హిళ‌ల‌కు మిగ‌తా ప‌ది మ‌గ‌వారికి. కానీ వీటిలో ఏ ఒక్క హెయిర్ స్టైల్ కూడా కిమ్‌ని పోలి ఉండ‌కూడ‌దు. ఇక వీరికి కేవ‌లం 28 వెబ్‌సైట్ల‌కే యాక్సెస్ ఉంటుంది. కంప్యూట‌ర్లు కూడా అంద‌రికీ అందుబాటులో ఉండ‌వు. కంప్యూట‌ర్ కొనాలంటే పెద్ద ప్ర‌క్రియే ఉంది. అందుకే ఉత్త‌ర కొరియాలో చాలా త‌క్కువ మంది వ‌ద్ద కంప్యూట‌ర్లు, ల్యాప్‌టాప్స్ ఉంటాయి.