Viral News: అత్తగారి ముద్దు.. విడాకులు కావాలంటున్న కోడలు
Viral News: ప్రేమగా మనవడిని ముద్దు పెట్టుకున్న పాపానికి కోడలు అత్తగారి విషయంలో నానా హంగామా చేసింది. వద్దు అని చెప్తున్నా తన బిడ్డను ముద్దు పెట్టుకుందని వారిస్తూ విడాకులు కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన బ్రిటన్లో చోటుచేసుకుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 34 ఏళ్ల సోఫీ అనే మహిళ నెల రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పుడే పుట్టిన పిల్లలకు త్వరగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి కాబట్టి ఆ భయంతో ఒక మూడు వారాల పాటు బిడ్డ వద్ద తాను మాత్రమే ఉంటానని అత్తింటివారికి చెప్పిందట. అయినా వారు వినిపించుకోకుండా బిడ్డ వద్దకు వెళ్లిపోయి ఎత్తుకని మరీ ముద్దులు పెట్టేసింది అత్తగారు. అది చూసిన సోఫీ షాకైంది. ఓ కోడలిగా తన బాధేంటో తనకున్న ఇబ్బందులు ఏంటో ఇంట్లో వారు కనీసం అర్థంచేసుకోకపోగా.. భర్త పక్కనే ఉండి కూడా తనకు సపోర్ట్ చేయలేదని వాపోయింది.
ఈ విషయాన్ని సోఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పెళ్లైన వారిని హెచ్చరిస్తోంది. సోఫీ అత్తగారు హాస్పిటల్లోని తన గదిలోకి చొరబడి బిడ్డను ఎత్తేసుకుని ముద్దు పెట్టడమే కాదు.. ఓ బిడ్డను తల్లి ఎలా చూసుకోవాలో క్లాస్ పీకడం మొదలుపెట్టిందట. దాంతో సోఫీకి మరింత ఒళ్లు మండిపోయింది. ఇదే విషయం గురించి సోఫీ తన భర్తకు వివరించగా.. ఇలాంటి సమయంలో అత్తింటివారు వెంటే ఉన్నందుకు సంతోషించక ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నావ్ అని కసిరాడట. (Viral News)
దాంతో సోఫీ ఇక విడాకులు తీసుకోవాల్సిందేనని నిర్ణయించేసుకుంది. చాలా మందికి ఇది చిన్న విషయం కావచ్చని.. కానీ తాను పెట్టుకున్న లిమిట్స్ని క్రాస్ చేసే హక్కు ఎవ్వరికీ లేదని అంటోంది. బిడ్డ పుట్టిన మూడు రోజులకే అందరూ మీద పడిపోయి ముద్దులు పెట్టేస్తుంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని అప్పుడు బిడ్డను క్వారెంటైన్ చేయాల్సి ఉంటుందని.. ఇవేమీ కూడా ఆలోచించకుండా వారు హద్దులు దాటినప్పుడు తనకు తన బిడ్డకు అలాంటివారి మధ్య ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది.
ALSO READ: మూడో భార్యకు నచ్చలేదని.. కన్నబిడ్డను చంపేసాడు
నేను నా భర్త ఇద్దరం ఇంట్లో వాళ్లకి క్లియర్గా చెప్పాం. బిడ్డను ఒక రెండు నెలల తర్వాత ఎత్తుకుంటే బాగుంటుంది అప్పటివరకు ఎవ్వరూ ముట్టుకోవద్దు అని. ఎందుకంటే ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అందులోనూ ఇది నా తొలి కాన్పు. విషయం ఇంట్లో వారికి అర్థమైంది అనుకున్నాం. కానీ నాకు బిడ్డ పుట్టిన నాలుగో రోజే బెలూన్లు, బొమ్మలతో నేరుగా హాస్పిటల్లోని నా రూంలోకి వచ్చేసింది. ఆమెతో పాటు నాకు తెలీని బంధువులు కూడా ఉన్నారు. నా బిడ్డను ఉన్నపళంగా ఎత్తేసుకుని ముద్దులు పెట్టేసారు. దాంతో ఉండలేక వారిపై అరిచేసాను. అక్కడి నుంచి వెళ్లిపోమన్నాను. ఆ తర్వాత ఆమె ఏడ్చుకుంటూ నా భర్తకు కాల్ చేసి చెప్పింది. ఆ తర్వాత నా భర్త నాకు క్లాస్ పీకాడు. కుటుంబంలో మొదటి మనవడు కావడంతో తన తల్లి ఇంతగా ఎగ్జైట్ అయ్యారట. అందులో తప్పేముంది వెంటనే క్షమించమని అడుగు అని ఫోర్స్ చేసాడు.
ఇలాంటి సమయంలో అత్తగారు నా భర్తను ఒక ఆయుధంలా వాడుకుంటోంది. నాకు సపోర్ట్ చేయాల్సిన నా భర్త తల్లికే మద్దతు ఇస్తున్నాడు. ఇందులో నా తప్పేముందో తెలీడంలేదు. నేను నా కోసం బిడ్డను ఒక రెండు నెలల పాటు చూడొద్దు అని చెప్పలేదు. బిడ్డ ఆరోగ్యం కోసం ఈ నియమం పెట్టాను. ఇలాంటి అత్తగార్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలు ఇలాంటి వారి వల్లే కూలిపోతాయి. ఇంత జరిగినా కూడా నా భర్త నా వైపు నిలబడటంలేదు అంటే నా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలీక ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అని పోస్ట్ చేసింది సోఫీ.