Viral News: ప్రియుడి మోసం.. అత‌ని తండ్రిని పెళ్లాడిన ప్రేయ‌సి..!

Viral News: ప్రియుడి మోసం భ‌రించ‌లేక‌పోయిన ఓ యువ‌తి ఏకంగా అత‌ని తండ్రినే పెళ్లాడింది. ఇది సినిమా సీన్ కాదండోయ్. నిజంగానే జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఆ వ్య‌క్తి సోద‌రి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డిస్తూ ఇప్పుడేం చేయ‌మంటారు అని నెటిజ‌న్ల‌ను స‌ల‌హా అడుగుతోంది. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జరిగిందో గోప్యంగా ఉంచింది ఆ యువ‌తి. రెడిట్ అనే యాప్ ద్వారా త‌న కుటుంబం ప‌ట్ల జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను వెల్ల‌డించింది. త‌న సోద‌రుడు ఓ యువ‌తితో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడ‌ని.. కానీ ఆమెతో బ్రేక‌ప్ అవ్వ‌డం వ‌ల్ల వేరే పెళ్లికి ఒప్పుకున్నాడ‌ని తెలిపింది. (Viral News)

ఈ విష‌యం ప్రేయ‌సికి తెలీడంతో త‌న తండ్రిని వ‌ల్లో వేసుకుని ఆయ‌న్ను పెళ్లి చేసేసుకుందని పేర్కొంది. అయితే.. ఈ విష‌యాన్ని ఇంట్లో వారికి తెలీనివ్వ‌కుండా త‌న తండ్రిని మ‌భ్య పెట్టింద‌ట‌. తీరా ఆ అబ్బాయి నిశ్చితార్ధం స‌మ‌యానికి ఆ యవ‌తి ఇలా అత‌ని తండ్రిని పెళ్లి చేసుకున్నానంటూ షాకిచ్చింది. అంత‌టితో ఆగలేదు.. తాను కూడా కుటుంబంలో ఒక‌దానినేన‌ని.. వ‌రుడికి త‌ల్లి వ‌రుస అవుతాన‌ని నానా హంగామా చేసింది. వ‌ధువు గురించి కూడా అస‌భ్య‌క‌రంగా మాట్లాడింద‌ట‌. అస‌లు అంద‌గానే లేద‌ని దుస్తులు కూడా బాలేవ‌ని హేళ‌న చేసింద‌ట‌.

ALSO READ: పెళ్లి చేసుకోమంటూ ఆఫీస్‌లో ర‌చ్చ‌..!

దాంతో ఇక పెళ్లి స‌మ‌యానికి ఏం చేస్తుందో అని భ‌య‌ప‌డి వ‌రుడి సోద‌రి ఓ ప్లాన్ వేసింది. ఆమెను ఎలాగోలా మ‌ద్యం మ‌త్తులో ముంచితే పెళ్లి తంతు పూర్త‌య్యే వ‌ర‌కు నోరుమూసుకుని ప‌డి ఉంటుంద‌ని భావించింది. ఇందుకోసం త‌న స్నేహితుల సాయం కోరింది. అలా పెళ్లి రోజున‌ మెల్లిగా ఆమెతో స‌న్నిహితంగా మెలిగిన‌ట్లు న‌టించి పీక‌ల దాకా తాగించారు. దాంతో ఆమె మ‌త్తులో ప‌డుకుండిపోయింది. దాంతో ఎలాంటి గొడ‌వ లేకుండా పెళ్లి తంతు సజావుగా సాగిన‌ట్లు ఆ యువ‌తి వెల్ల‌డించింది.

రెడిట్‌లో ఈ పోస్ట్‌ని చ‌దివిన‌వారంతా కూడా వ‌రుడి సోదరి చేసిన ప‌నిని ప్ర‌శంసిస్తున్నారు. బ్రేక‌ప్ అయితే కూర్చుని మాట్లాడుకోవ‌డ‌మో అన్నీ మ‌ర్చిపోయి మూవ్ ఆన్ అవ‌డ‌మో చేయాలి కానీ ప్రియుడి తండ్రిని పెళ్లి చేసుకోవ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. ఇలాంటి వారి వ‌ల్ల కుటుంబాలు నాశ‌న‌మైపోతున్నాయ‌ని.. ఇలాంటి వారిని ఊరికే వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని అంటున్నారు. ఇక్క‌డ మ‌రో షాకింగ్ విష‌యం ఏంటంటే.. వ‌రుడి తండ్రి రెండో పెళ్లి చేసుకున్న విష‌యం ఇంట్లో దాచ‌డం. తాను పెళ్లి చేసుకుంది మ‌రెవ‌రినో కాదు అన్నీ స‌జావుగా జ‌రిగి ఉంటే త‌న‌కు కాబోయే కోడ‌లినే అన్న విష‌యం తెలిసి అత‌ను కూడా షాకయ్యాడు. కానీ ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా అత‌ను విడాకులు ఇవ్వ‌డం.. లేదా మోసం చేసింద‌ని కేసు పెట్ట‌డం వంటివి కూడా చేయ‌లేదంటే.. ఎలాంటి స‌మాజంలో జీవిస్తున్నామో త‌లుచుకుంటేన సిగ్గు చేటుగా ఉంది.