Viral News: ఆస్తి కోసం అత్తగారితో డిష్యుం డిష్యుం
Surat: ఆస్తి కోసం అత్తతో గొడవపడి కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ (viral news) అవుతోంది. గుజరాత్‌లోని సూరత్‌లో (surat) ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి పంపకాలు చేయలేదని ఓ యువతి.. తన అత్తను తిట్టి కొట్టింది. ఆ యువతి మామగారు ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. పక్కనే ఉన్న వారి మనవరాలు ఈ ఘటనను చూస్తూ బెదిరిపోయింది. అత్తగారి ముఖంపై కొరికిన పంటి గాట్లు కూడా వీడియోలో క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇది ఎటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాబట్టి వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.