Viral News: అత్తింటికి మాజీ భర్తతో వచ్చిన వధువు..!
Viral News: అత్తింటికి కానుకలు తీసుకెళ్లే కోడలిని చూసాం కానీ.. ఏకంగా మాజీ భర్తనే తీసుకెళ్లింది ఓ వధువు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. మాజీ భర్తతో కలిసి ఉండొచ్చు అని రెండో భర్త కూడా ఒప్పుకోవడం. అదే మ్యాజిక్కు. అసలు మ్యాటర్ ఏంటంటే.. అమెరికాకు చెందిన క్రిస్ అనే 38 ఏళ్ల యువతి.. 36 ఏళ్ల జేమ్స్‌ని వివాహం చేసుకుంది. ఇద్దరూ దాంపత్య జీవితాన్ని సంతోషంగా మొదలుపెడతారనగా.. క్రిస్ ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనతో పాటు తన మాజీ భర్త బ్రాండన్ కూడా ఉంటాడని చెప్పింది.
ఈ విషయం విన్న జేమ్స్‌కి గుండె పగిలినంత పనైంది. కానీ విషయం తెలుసుకుని ఇందుకు ఒప్పుకున్నాడు. జేమ్స్‌ని పెళ్లి చేసుకోక ముందు క్రిస్‌కి బ్రాండన్‌కి వివాహం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు బ్రాండన్‌కు ఓ రోడ్డు ప్రమాదంలో మానసిక వికలాంగుడిగా మారిపోయాడు. అప్పటి నుంచి బ్రాండన్‌కి క్రిస్ అన్నీ తానై చూసుకుంది. ఓ భార్యగా, అమ్మగా అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఇప్పుడు క్రిస్ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ.. బ్రాండన్‌ను వదిలేస్తే పాపం బతకలేడు. దాంతో తనతో పాటు తెచ్చకుంటాను అని తన రెండో భర్త అయిన జేమ్స్‌కి చెప్పింది. ఇందుకు జేమ్స్ కూడా ఒప్పుకోవడంతో ఇంట్లో వారు కూడా ఏమీ అనలేకపోయారు. (Viral News)