Viral News: “మోసం చేస్తే కాపురం బాగుంటుంది అంటున్నాడు”
Viral News: ఈ మధ్యకాలంలో అసలు దంపతులు ఎలా ఆలోచిస్తున్నారంటే.. వింత వింత ఆలోచలన్నీ పెళ్లైన వారికే వస్తాయేమో అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. చక్కగా చూసుకునే భార్య ఉండగా.. ఆమె భర్త మరో యువతితో గడిపి మోసం చేస్తానని అంటున్నాడట. దాంతో ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనకు సలహా ఇవ్వండి అని కోరింది.
వారిద్దరి వయసు 30. పెళ్లై 2 ఏళ్లు అవుతోంది. అప్పటివరకు వారి కాపురం సజావుగానే సాగింది. ఉన్నట్టుండి ఏమైందో ఏమో.. భర్త వచ్చి నేను త్వరలో నిన్ను మోసం చేయబోతున్నాను. అలా చేస్తే మన కాపురం ఇంకా బలపడుతుంది అన్నాడట. దాంతో ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్లు అయ్యింది. ముందు ఏదో ఏడిపించడానికి అలా అంటున్నాడు అనుకుందట. తీరా చూస్తే నిజంగానే అతను మరో యువతితో గడపాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
పైగా వైవాహిక జీవితంలో మోసం అనేది పెద్ద తప్పేమీ కాదని ఇలా చేస్తేనే బంధం మరింత బలపడే ఛాన్స్ ఉందని అంటున్నాడట. బయట ఎంత మంది పరాయి స్త్రీలకు ఆకర్షితులైనా కూడా చివరికి భార్య దగ్గరికే కదా వచ్చేది అని అర్థంలేకుండా మాట్లాడుతున్నాడట. అతని మాటలకు పిచ్చెక్కి ఏం చేయమంటారు ఫ్రెండ్స్ అంటూ ఆ మహిళ సోషల్ మీడియాలో తన బాధను చెప్పుకుంది. ఆమె పోస్ట్‌ని చూసిన నెటిజన్లకు కూడా దిమ్మ తిరిగింది. ఇదెక్కడి గొడవరా బాబూ అంటూ తలబాదుకుంటున్నారు. చాలా మంది విడాకులు ఇచ్చేసి హాయిగా బతుకు అని సందేశాలను పంపుతున్నారు.
ALSO READ: Asif Ali Zardari: భార్య స్థానంలో కూతురు.. ఇలా ఎందుకు ప్రకటించారు?