Viral News: పెళ్లైన తొలిరాత్రే.. గుండెపోటుతో దంపతుల మృతి
Uttar Pradesh: పెళ్లైన తొలిరాత్రే దంపతులు ఇద్దరూ గుండెపోటుతో చనిపోవడం వైరల్‌గా మారింది (viral news) . ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో (uttar pradesh) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరైచ్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల ప్రతాప్ యాదవ్.. పుష్ప అనే యువతిని మే 30న పెళ్లి చేసుకున్నాడు. అదే రోజు రాత్రి వారిద్దరూ ఒకే గదిలో నిద్రించడానికి వెళ్లారు. అలా గదిలోకి వెళ్లినవారు ఉదయం ఎంతసేపైనా తలుపులు తెరవలేదు (viral news) . దాంతో బంధువులు తలుపులు బద్దలకొట్టి చూడగా ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. దాంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపించగా.. ప్రతాప్, పుష్పలు గుండెపోటుతో చనిపోయినట్లు రిపోర్టులో తెలిసింది. దాంతో అంతా షాకయ్యారు. వారిద్దరి వయసు 20 ఏళ్లే. ఇంత చిన్నవయసులో గుండెపోటుతో చనిపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరి మృతదేహాలకు ఒకే చితిపై ఉంచి దహనసంస్కారాలు చేసారు.