Viral News: బిల్లు క‌ట్ట‌కుండా ఫ్యామిలీతో 5 స్టార్ హోట‌ల్‌లోనే!

Delhi: ఓ వ్య‌క్తి బిల్లు క‌ట్ట‌కుండా కుటుంబంతో క‌లిసి హోట‌ల్‌లోనే ఉంటూ యాజ‌మాన్యాన్ని చీట్ చేసాడు (viral news). ఈ ఘ‌ట‌న దిల్లీలో (delhi) చోటుచేసుకుంది. లుట్యెన్స్ ఏరియాలోకి ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో మే 28న‌ ఏకంగా రెండు రూములు బుక్ చేసుకున్నాడు ఓ వ్య‌క్తి. చెకిన్ అయ్యేట‌ప్పుడు ఎలాంటి పేమెంట్ చేయ‌లేదు. మే 30లోపు చేసేస్తాన‌ని చెప్ప‌డంతో హోట‌ల్ సిబ్బంది కూడా న‌మ్మి రూంలు కేటాయించారు. ఆ త‌ర్వాత వారం అవుతున్నా ఆ వ్య‌క్తి బిల్లు క‌ట్ట‌లేదు. ఆ విష‌యం అడిగితే రూ.6 ల‌క్ష‌లు ఎప్పుడో క‌ట్టేసాన‌ని ఆన్‌లైన్ పేమెంట్ చూపించాడ‌ట‌. దాంతో వారు న‌మ్మి ఊరుకున్నారు. ఆ త‌ర్వాత హోట‌ల్ ట్రాన్సాక్ష‌న్ వివ‌రాలు చూస్తే రూ.6 పేమెంట్ అయిన‌ట్లు ఎక్క‌డా లేదు. దాంతో మ‌ళ్లీ బిల్లు గురించి అడ‌గ్గా.. ఆల్రెడీ క‌ట్టేసాన‌ని ఫోర్స్ చేస్తే పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తానంటూ గొడ‌వ పెట్టుకున్నాడు. హోట‌ల్‌లోని వ‌స్తువులు ప‌గ‌ల‌గొట్టేసాడు. దాంతో హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఆ వ్యక్తి దాదాపు రూ.3 ల‌క్ష‌లు బిల్లు చెల్లించాల్సి ఉంద‌ని, ఫుడ్, బీర్లు ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా ఆర్డ‌ర్ చేసుకునేవాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.