ఇక దాచలేను అంటూ మర్డర్ కేసులో లొంగిపోయిన నిందితుడు
Mexico: మర్డర్ చేసిన 15 ఏళ్ల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు ఓ నిందితుడు (viral news) . మెక్సికోకి (mexico) చెందిన టోనీ అనే వ్యక్తి 2008లో తన ఓనర్ విలియంని చంపేసాడు. విలియం కనిపించకుండాపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. విలియం ఇంట్లో అద్దెకు ఉంటున్న టోనీపై అనుమానంతో విచారణకు పిలిపించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో ఆ కేసు మిస్టరీ గానే ఉండిపోయింది.
అయితే 15 ఏళ్ల తర్వాత టోనీకి బుద్ధి వచ్చింది. ఇక ఈ అబద్ధపు జీవితాన్ని గడపలేను అంటూ పోలీసులకు లొంగిపోయాడు. విలియం చాలా మంచి వ్యక్తని అలాంటి వ్యక్తిని స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపేసానని తెలిపాడు. దాంతో పోలీసులు అతనిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ చార్జ్ నమోదు చేసాడు. విలియంను పాతిపెట్టిన స్థలంతో పాటు చంపడానికి ఉపయోగించిన స్క్రూ డ్రైవర్ కూడా పోలీసులకు ఇచ్చాడు. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని దాస్తూ వచ్చానని, ఇక దాస్తూ బతకడం తన వల్ల కాదంటూ పోలీసుల ముందు కన్నీరుపెట్టుకున్నాడు టోనీ.