చలానా విధించారని.. పోలీస్ స్టేషన్ కరెంట్ వైర్ కట్ చేసాడు!
Uttar Pradesh: చలానా (challan) విధించారన్న కోపంతో ఓ లైన్‌మ్యాన్ ఏకంగా పోలీసులకే (police) చుక్కలు చూపించాడు (viral news). పోలీస్ స్టేషన్‌లో పవర్ సప్లై చేసే వైర్లు కట్ చేసి వారిని ముప్పతిప్పలు పెట్టాడు. ఈ వైరల్ ఘటన (viral news) ఉత్తర్‌ప్రదేశ్‌లో (uttar pradesh) చోటుచేసుకుంది. హపూర్ జిల్లాకు చెందిన ఖలీద్ అనే వ్యక్తి నిన్న మీరఠ్ నుంచి హపూర్‌కు బైక్ మీద వచ్చాడు. కానీ హెల్మెట్ పెట్టుకోలేదు. దాంతో పోలీసులు ఖలీద్ బైక్ ఆపి రూ.1000 చలానా విధించారు. తాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో లైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్నానని, పని మీద హపూర్ వచ్చానని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. దాంతో రూ.1000 చెల్లించాల్సి వచ్చింది. దాన్ని మనసులో పెట్టుకుని ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు ఖలీద్. తిరిగి మీరఠ్ వెళ్లి.. హపూర్ పోలీస్ స్టేషన్‌కు, పోలీసులు ఉండే ఇళ్లకు పవర్ సప్లై చేసే వైర్లు తెంచేసాడు. దాంతో 24 గంటల పాటు కరెంట్ లేక పోలీసులు అల్లాడిపోయారు. అయితే ఈ విషయంపై హపూర్ ఎలక్ట్రిసిటీ అధికారులు స్పందించలేదు.