వచ్చింది 35 మార్కులే.. సంబరాలు చేసుకున్న కుటుంబం!
Thane: వచ్చింది జస్ట్ పాస్ మార్కులే. అదీ ఒక్క సబ్జెక్ట్‌లో కాదు. అన్ని సబ్జెక్టుల్లో. అయినా సరే ఆ కుటుంబం ఫస్ట్ ర్యాంక్ వచ్చినంతగా సెలబ్రేట్ చేసుకుంది (viral news). దీని వెనుక ఓ కారణం ఉంది. అదేంటో చూద్దాం. మహారాష్ట్రలోని థానేకు చెందిన విశాల్ కరాడ్ అనే యువకుడు పదో తరగతి పరీక్షల్లో ప్రతి సబ్జెక్ట్‌లోనూ జస్ట్ పాస్ మార్కులే తెచ్చుకున్నాడు. సాధారణంగా వేరే తల్లిదండ్రులైతే పిల్లల్ని దూషిస్తూ తిట్టిపోసేవారు. పాస్ ఎవరైనా అవుతారు మంచి మార్కులు కదా ముఖ్యం అని కొట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ విశాల్ తల్లిదండ్రులు అలా కాదు. అదేదో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే విశాల్, అతని కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు అలాంటివి. అసలు స్కూల్‌కి వెళ్తేనే గొప్ప అనుకునేవారు. ఎందుకంటే విశాల్ తండ్రి ఓ ఆటో డ్రైవర్, తల్లి పని మనిషిగా పనిచేస్తుండేవారు. పిల్లాడిని స్కూల్‌కి పంపాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. అయినా వారు విశాల్‌ని చదివించాలనుకున్నారు. విశాల్ ఉన్న పరిస్థితిలో వేరే పిల్లలు కనీసం స్కూల్‌కి వెళ్లాలని కూడా అనుకోరని, అలాంటిది తమ బిడ్డ కష్టపడి పదో తరగతి పాసైనందుకు సంతోషంగా ఉందని చెప్తున్నారు.