Viral News: నాకు ఉద్యోగం ఇస్తే 500 డాల‌ర్లు ఇస్తా!

in a viral news employee told recruiter that he will pay 500 dollars if he hires him

Viral News: ఏద‌న్నా ఉద్యోగానికి అప్లై చేసే స‌మ‌యంలో ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హ‌త‌, నైపుణ్యాలు మ‌న‌లో ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడు అప్లై చేస్తుంటాం. పాపం ఉద్యోగం క‌చ్చితంగా కావాలి అనుకునేవారు రిక్రూట‌ర్ల‌కు ప‌ర్స‌న‌ల్ మెయిల్స్ పెడుతుంటారు. ద‌య‌చేసి నా రెజ్యూమ్ చూడండి.. ఏమ‌న్నా అవ‌కాశాలు ఉంటే చెప్పండి అని. కానీ వింగిఫై అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓన‌ర్ ప‌ర‌స్ చోప్రాకు ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఓ వ్య‌క్తి నుంచి వింత అనుభ‌వం ఎదురైంది.

ఈ ఉద్యోగం నాకు ఇస్తే నేనే మీకు 500 డాల‌ర్లు అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు రూ.40,000 ఇస్తాను అని పేర్కొంటూ మెయిల్ పెట్టాడ‌ట‌. దాంతో ప‌ర‌స్ షాక‌వ్వ‌డంతో పాటు అత‌ని ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయాడు. ఈ విష‌యాన్ని ప‌ర‌స్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. అయితే అత‌ను 500 డాల‌ర్లు ఇస్తాన‌న్న‌ది లంచంగా కాదు. అత‌న్ని ప‌నిలో పెట్టుకున్నాక ఒక వారం రోజుల పాటు త‌న ప‌నితీరు ఎలా ఉందో తెలుసుకుని న‌చ్చితేనే ప‌నిలో పెట్టుకోవాల‌ని.. లేదంటే తాను ఇచ్చిన 500 డాల‌ర్లు వెన‌క్కి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పాడ‌ట‌. ఇలాంటి బంప‌ర్ ఆఫ‌ర్‌ను ఏ కంపెనీ కూడా వ‌దులుకోదు. అందుకే ప‌ర‌స్ ఓ అవకాశం ఇచ్చి చూద్దాం అన్న‌ట్లు అత‌నికి జాబ్ ఇచ్చార‌ట‌.