Viral News: లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. షాకిచ్చిన ఉద్యోగి!
Viral News: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కీలకంగా మారింది. అలాంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేని ఉద్యోగాలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. కంపెనీ కోసం కెరీర్ కోసం ఎంతో కష్టపడుతూ ఎప్పుడో ఒకసారి సెలవులు పెట్టుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఆ సెలవు తీసుకున్న రోజు కూడా బాస్ సెలవు క్యాన్సిల్ చేసి ఆఫీస్ వర్క్ చేయాలంటే? ఎవరికైనా మండుతుంది. ఆ ఉద్యోగం లేకపోతే తిండి లేదు అనుకునేవారు పాపం అన్నీ త్యాగం చేసుకుని బాస్ చెప్పినట్లు వింటారు. కానీ అందరూ అలా ఉండాలన్న రూల్ ఏం లేదుగా.. ! అందుకే ఓ ఉద్యోగి తన సెలవు క్యాన్సిల్ చేసిన బాస్‌కి రాజీనామా ఇచ్చి రివర్స్ షాక్ ఇచ్చాడు. (Viral News)
ALSO READ: Viral News: ఇంకోసారి జాబ్‌కి అప్లై చేస్తే బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం.. కంపెనీ ఓవరాక్షన్
అయితే ఈ ఘటన మన భారతదేశంలో జరగలేదు లెండి. ఆస్ట్రేలియాలో (Australia) జరిగింది. నోయెల్ అనే ఓ ఉద్యోగి వ్యక్తిగత కారణాల వల్ల ఒక వారం రోజుల పాటు సెలవు పెట్టుకున్నాడు. అయితే అదే సమయంలో నోయెల్ పనిచేస్తున్న ఆఫీస్‌లోకి ఓ ఉద్యోగి జాబ్ మానేసాడు. దాంతో అతని పని నోయెల్‌పై పడింది. ఈ నేపథ్యంలో నోయెల్ కూడా లేకపోతే వర్క్ ఆగిపోతుందని భయపడిన యజమాని.. నోయెల్ పెట్టుకున్న సెలవులను రద్దు చేసాడు. దాంతో నోయెల్‌కు ఒళ్లు మండింది. వెంటనే ఆ కంపెనీకి రాజీనామా చేసేసాడు.
ALSO READ: Viral News: వారు ఉద్యోగం తీసేస్తే.. గూగుల్ డబుల్ సాలరీతో బంపర్ ఆఫర్!
నోయెల్ సెలవులు కావాలనుకున్నప్పుడు ఆ యజమాని ఇలా ఓ సిబ్బంది రాజీనామా చేసాడని కనీసం డిస్కస్ కూడా చేయలేదట. ముందు లీవ్స్ అప్రూవ్ చేసి అసలు ఏం జరిగిందో వివరించకుండా క్యాన్సిల్ చేయడంతో తాను ఉద్యోగానికి రాజీనామా చేసాను అంటూ నోయెల్ టిక్‌టాక్‌లో ఈ విషయాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. అతని నిర్ణయాన్ని అందరూ సపోర్ట్ చేసారు. కంపెనీలో పనిచేస్తున్నంత మాత్రాన ఒక ఉద్యోగి పట్ల ఇలా ప్రవర్తించడం సమంజసం కాదంటూ ఆ యజమానిపై సెటైర్లు వేస్తున్నారు.
ఒకప్పుడు ఉద్యోగులు కంపెనీ రూల్స్‌కి కట్టుబడి పనిచేసేవారు. ఒకరి కింద పనిచేస్తున్నాం కాబట్టి వారు ఏది చెబితే దానికి ఊ కొడుతూ ఎవరి పని వారు చేసుకునిపోయేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయ్. వర్క్ లైఫ్ మారింది. బాస్ ఏది చెబితే అది చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు. కార్పొరేట్ కల్చర్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగికి కల్పించాల్సిన అన్ని హక్కులు, బెనిఫిట్స్ కల్పించకపోతే ఎవ్వరూ కూడా ఉద్యోగం చేయడానికి ముందుకు రావడంలేదు. ఏమీ లేకపోతే సొంతంగా చిన్న కొట్టు పెట్టుకుని బతుకుతాం కానీ ఇలా వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి పనిచేయడం మా వల్ల కాదు అనుకుంటున్నవారు చాలా మందే ఉన్నారు.
ALSO READ: Viral News: రెస్యూమ్ చూసి జడుసుకున్న హెచ్ఆర్..!
అందులోనూ ఇటీవల ఆస్ట్రేలియా పార్లమెంట్లో వర్కర్స్ రైట్స్ అనే బిల్లుని ప్రవేశపెట్టారు. వర్కర్లు ఓవర్ టైం చేయడానికి వీల్లేదని.. వారి చేత ఒవర్ టైం చేయించుకున్నప్పుడు అందుకు తగ్గ జీతం ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు. అంతేకాదు.. వారు సెలవుల్లో ఉన్నప్పుడు, షిఫ్ట్ టైం అయిపోయాక యజమానులు మెసేజ్‌లు, కాల్స్ చేసి అదనంగా పనిచేయాలని కానీ సెలవులు రద్దు చేసుకోవాలని కానీ అడగకూడదని అలా చేస్తే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా పార్లమెంట్లో డిస్కస్ చేసారు.