Viral News: నీ పెళ్లాం కంటే నేనే బెటర్..!
Hyderabad: నీ పెళ్లాం కంటే నేనే బెటర్ అంటూ ఓ యువతి గొడవపడుతున్న సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (viral news) అవుతోంది. దాంతో ఆ వీడియోపై నెటిజన్లు తెగ జోకులు పేలుస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ మధ్యకాలంలో కుక్కల దాడులు ఎక్కువై పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఇండియాలోని ఓ ప్రాంతంలో ఓ యువతి తన పెంపుడు కుక్కతో జాగింగ్‌కి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుంటే లిఫ్ట్‌లో ఉన్న దంపతులు ఆమెను ఆపేసారు. తన భార్య గర్భవతి అని కుక్క మూతికి మాస్క్ వేసి లిఫ్ట్‌లో రావాలని ఓ వ్యక్తి ఆ యువతితో చెప్పాడు. ఇందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. కావాలంటే లిఫ్ట్ మళ్లీ కిందికి వచ్చే వరకు వెయిట్ చేస్తాను కానీ కుక్కకు మాత్రం మాస్క్ వెయ్యనని తెగేసి చెప్పింది.
గొడవ కాస్తా పెద్దది కావడంతో లిఫ్ట్‌లో ఉండి ఇదంతా చూస్తున్న మరో వ్యక్తి వీడియో తీయడం మొదలుపెట్టాడు. కుక్కకు మాస్క్ మాత్రమే పెట్టమన్నాం కదా ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు అంటూ ఆ వ్యక్తి గదమాయించాడు. ఇందుకు ఆ యువతి.. కుక్కలు అందరినీ కరవవు. మీలాంటివారిని మాత్రమే కరుస్తాయి అని ముఖం మీదే అనేసింది. ఆ మాట వినగానే ఆ వ్యక్తి ఏం అమ్మాయివి నువ్వు అని అన్నాడు. దానికి ఆ యువతి.. నీ భార్య కంటే నేనే బెటర్ అని అనడం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ జర్నలిస్ట్ ట్విటర్‌లో షేర్ చేసారు.
Couple where wife is pregnant requests this woman to mask her dog inside the lift. Not only she refuses, she says " आप जैसे लोगों को ही कुत्ते काटते हैं"
Video via @sachingupta787 pic.twitter.com/hocJ3i1dOp
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 7, 2023