Viral News: ఇష్టం లేని పెళ్లి.. తండ్రికి ఓ రేంజ్‌లో షాకిచ్చిన వధువు
Rajasthan: ఇష్టపడిన వ్యక్తిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది ఓ యువతి (viral news) . కానీ అది తండ్రికి ఇష్టంలేక పెళ్లైన వ్యక్తితో మళ్లీ పెళ్లి చేయాలనుకున్నాడు. దాంతో తండ్రికి బుద్ధిచెప్పాలనుకుంది ఆ యువతి. అలా ఆమె ఏం చేసిందో చూడండి. రాజస్థాన్‌లోని (rajasthan) జోధ్‌పూర్‌కు చెందిన తరుణ ఛత్తీస్‌గడ్‌కు చెందిన సురేంద్ర అనే యువకుడిని ఇష్టపడింది. ఇద్దరూ చదువుకుంటున్న రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ వీరి పెళ్లికి తరుణ తండ్రి ఒప్పుకోలేదు. కారణం అతనిది వేరే కులం. అయినా కూడా తరుణ తనకు నచ్చినవాడినే పెళ్లి చేసుకుంది.
అది నచ్చని తండ్రి తరుణని బలవంతంగా లాక్కెళ్లి తన కులానికి చెందిన ఆల్రెడీ పెళ్లైన వ్యక్తితో మళ్లీ పెళ్లి జరిపించాడు. దాదాపు 6 నెలల పాటు వేరే రాష్ట్రాల్లో ఉంచి తనకు ఫోన్ ఇవ్వకుండా ఇంట్లోనే ఉంచేసారు. తర్వాత తరుణ ఎలాగైనా తను కోరుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్లాలనుకుంది. దాంతో ఒంట్లో బాలేదని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని చెప్పింది. వారు హాస్పిటల్‌కు తీసుకెళ్లాక అక్కడి నర్సు ఫోన్ తీసుకుని సురేంద్రకు జరిగినదంతా చెప్పింది. అంతేకాదు ఇంట్లోవారు చూస్తుండగానే ఆ రెండో పెళ్లి కొడుక్కి రాఖీ కట్టింది. దాంతో అంతా షాకయ్యారు. తన రెండో భర్త టార్చర్ పెడుతున్నాడని ఇలాంటి బతుకు తనకు అవసరం లేదని తరుణ ఇంట్లో వాదించింది. తనని ఎంతో ప్రేమించిన సురేంద్ర వద్దకు వెళ్లిపోతానని పట్టుబట్టింది. అయినా తరుణ తండ్రి కనికరించలేదు. దాంతో ఆమె తన బాధను ట్విటర్లో పోస్ట్ చేసింది. సాయం చేయాలంటూ నటుడు సోనూ సూద్‌ని (sonu sood) కూడా ట్యాగ్ చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.