Viral News: రోజూ విమానంలో ఆఫీస్‌కి..!
America: ఆఫీస్‌కి వెళ్లేవారు వారు పనిచేస్తున్న కంపెనీకి దగ్గర్లో ఇల్లు తీసుకుని ఉంటుంటారు (viral news). లేదా ఏదైనా హాస్టల్స్‌లో ఉంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. రెంట్లు కట్టుకోలేనివారు రోజూ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రైళ్లు, బస్సుల్లోనూ ప్రయాణిస్తుంటారు. కానీ అమెరికాకి (america) చెందిన ఓ అమ్మాయి మాత్రం ఆఫీస్‌కి రోజూ విమానంలో వెళ్లి వస్తోంది. సోఫియా అనే 21 ఏళ్ల యువతి.. న్యూ జెర్సీలోని ఓ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. సోఫియా నివసించేది న్యూయార్క్‌లో. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం.. సోఫియా తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేచి వెంటనే ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతుంది.
న్యూజెర్సీకి వెళ్లే ఫ్లైట్ బుక్ చేసుకుంటుంది. ఇంటర్న్‌షిప్ అయిపోగానే మళ్లీ న్యూజెర్సీలోని ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి న్యూయార్క్ ఫ్లైట్ బుక్ చేసుకుంటుంది. వింటుంటేనే విడ్డూరంగా ఉంది కదా..! ఇంతకీ సోఫియా ఎందుకు ఇలా రోజూ విమానంలో ప్రయాణిస్తోంది అనుకుంటున్నారా? ఇందుకు కారణం.. న్యూజెర్సీలో రెంట్‌కి ఇల్లు తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. రెంట్‌కి అయ్యే ఖర్చుతో పోలిస్తే న్యూజెర్సీ నుంచి న్యూయార్క్‌కి ఫ్లైట్‌లో వెళ్లే ఖర్చు చాలా తక్కువట. అందుకే కాస్త అలసటగా అనిపించినా డబ్బు సేవ్ చేసుకుంటున్నానని చెప్తోంది సోఫియా.