“8 కాపురాలు కూల్చాను.. నాకు ఎఫైర్లు పెట్టుకోవడం ఇష్టం”
Viral News: లెస్బియన్ అయిన ఓ మహిళ మరో ఎనిమిది మంది వివాహితులతో అక్రమ సంబంధం పెట్టుకుని కాపురాలు కూల్చింది. ఇలా చేయడం బాధాకరమే అయినప్పటికీ తనకు థ్రిల్‌ని ఇస్తుందని తెలిపింది. అయితే వివాహితులతో అక్రమ సంబంధం పెట్టుకోకుండా ఉండలేకపోతున్నానని.. ఇలా చేయకుండా ఉండేందుకు తనకు సాయం కావాలని కోరుతోంది.
“” ఓసారి నేను ఓ యువతిని డేటింగ్ యాప్‌లో కలిసాను. తనను ఓ హోటల్‌లో కలిసాను. ఆమెతో సెక్స్ చేసాను. ఆ తర్వాత తనకు పెళ్లై ఒక పాప ఉందన్న షాకింగ్ విషయం చెప్పింది. అప్పటి నుంచి నేను ఎనిమిది మంది వివాహితులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. ఈ విషయం వారి భర్తలకు తెలిసి వారు కుంగిపోయారు. ఇది చేయడం తప్పని నాకు తెలుసు. ఇలా మోసం చేయడం నాకు థ్రిల్‌ని ఇస్తోంది. కానీ ఆపాలనిపించినా సాయం చేసేవారు లేక ఆపలేకపోతున్నాను. నాకు కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉండాలంటే భయమేస్తోంది. అందుకే ఈ ఎఫైర్లు పెట్టుకుంటున్నాను. అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు దొరికిపోతే కలిగే థ్రిల్ వేరు. కానీ ఇది చాలా డేంజరస్ గేమ్ “” అని తెలిపింది.
అయితే ఈ మహిళ తన వివరాలను బయటపెట్టేందుకు ఇష్టపడలేదు. తాను కేవలం బ్రిటన్‌లో ఉంటానని మాత్రమే వెల్లడించింది.