Viral News: ఫ్లైట్‌లోనే భార్యను చంపబోయాడు..!
Hyderabad: ఓ వ్యక్తి విమానంలోనే(flight) భార్యను చంపబోయిన ఘటన(viral news) ఎయిర్ ఇండియా(air india) విమానంలో చోటుచేసుకుంది. నెవార్క్(newark) నుంచి ముంబై(mumbai) వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఒక్కసారిగా ప్యానిక్ ఎటాక్ మొదలైంది. దాంతో విమానంలో గట్టిగా కేకలే వేస్తూ.. పక్కనే ఉన్న భార్య గొంతుపట్టుకున్నాడు. దాంతో సిబ్బంది వెంటనే డాక్టర్లను పిలిపించి సెడేటివ్స్ ఇవ్వడంతో అతను నిద్రపోయాడు.
ఈ విషయాన్ని అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి జరిగిన ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ ఫ్లైట్ ల్యాండ్ చేయాలంటూ రచ్చ చేసాడు. అతని భార్య గొంతు పట్టుకున్నాడు. నోటికొచ్చిన బూతులు మాట్లాడాడు. ఎయిరిండియా సిబ్బంది వెంటనే డాక్టర్లను పిలిపించి మెడికేషన్ ఇప్పించడంతో అంతా కూల్ అయ్యాం. అతనికి ప్యానిక్ ఎటాక్స్ వస్తుంటాయని, విమానం ఎక్కే ముందు ట్యాబ్లెట్స్ మర్చిపోయాడని అతని భార్య చెప్పారు. వెంటనే ఎయిరిండియా సిబ్బంది డాక్టర్లను పిలిపించి సరైన వైద్యం అందించడంతో మేం రిలాక్స్ అయ్యాం అని తెలిపారు.