Viral News: భార్యే సొంత చెల్లి అని తెలిసి..
Viral News: ఏ భర్తకు కానీ భార్యకు కానీ ఇలాంటి అనుభవం ఎదురుకాకూడదు. కట్టుకున్న భార్యే సొంత చెల్లి అని తెలిస్తే ఏ మగాడైనా తట్టుకోగలడా? ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. థామస్ అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం లీసాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే రెండో బిడ్డ పుట్టాక లీసాకు కిడ్నీ సమస్య వచ్చింది. కిడ్నీలు రెండూ పాడైపోయాయి. దాంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం చూస్తుండగా.. లీసా ఇంట్లో వారివి ఎవ్వరి కిడ్నీలు కూడా మ్యాచ్ కాలేదు. దాంతో థామస్ తన కిడ్నీ ఇవ్వాలనుకున్నాడు. ఇందుకోసం కావాల్సిన వైద్య పరీక్షలు కూడా చేసారు. కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. కానీ ఆ తర్వాత తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే.. థామస్, లీసాల డీఎన్ఏ ఒకటే. అంటే థామస్‌కు లీసా సోదరి అవుతుంది.
థామస్ పుట్టిన రెండో రోజే ఇతన్ని ఓ కుటుంబం దత్తత తీసుకుంది. దాంతో ఇతని అసలు తల్లిదండ్రులు ఎవరు అనేది కూడా రహస్యంగా ఉంచారు. తీరా చూస్తే ఇతని సొంత తల్లిదండ్రులకు పుట్టిన ఆడపిల్లనే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఈ విషయం ఇప్పుడు తెలీడంతో ఆవేదన చెందుతున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏదన్నా సలహా ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్తున్నారు. ఇంకొందరైతే.. చెల్లెలు అని తెలీక ముందు వరకు ప్రేమించావు కదా.. ఇప్పుడు కూడా అలాగే కొనసాగించు అని సలహాలు ఇస్తున్నారు.
ALSO READ: ప్రేయసిని మోసం చేసాను.. కానీ తనే కావాలనిపిస్తోంది
ALSO READ: వాహ్.. ప్రేయసంటే ఎంత ప్రేమ గురూ..!