Viral news: భార్యకు డ్రగ్స్ ఇచ్చి.. 51 సార్లు రేప్ చేయించి..!
France: భార్యకు రోజూ డ్రగ్స్ ఇచ్చి.. 51 మందితో రేప్ చేయించి మరీ వీడియోలు తీసాడు ఓ రాక్షసుడు (viral news) . ఈ ఘటన ఫ్రాన్స్‌లో (france) చోటుచేసుకుంది. దాదాపు పదేళ్ల పాటు నరకం అనుభవించిన ఆ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మజాన్ ప్రాంతానికి చెందిన డామినిక్ అనే వ్యక్తి.. రోజూ తన భార్య తినే ఫుడ్‌లో డ్రగ్స్ కలుపుతూ ఉండేవాడు. ఆమె స్పృహకోల్పోయి పడిపోగానే ఎవరో ఒకరితో బేరం కుదుర్చుకుని ఇంటికి రప్పించి రేప్ చేయించేవాడు. అలా వీడియోలు తీస్తూ ఆనందించేవాడు. ఆ వీడియోలన్నీ కంప్యూటర్‌లో అబ్యూసెస్ పేరుతో సేవ్ చేసుకునేవాడు.
డామినిక్‌కి అతని భార్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అసోన్ ఇన్సు అనే ఇంటర్నెట్ ఫోరం ద్వారా ఇతరులతో పరిచయం పెంచుకుని తన భార్యను రేప్ చేయిస్తుండేవాడు. పైగా ఎంత పక్కాగా రేప్ చేయించేవాడంటే.. అతని భార్య స్పృహకోల్పోగానే ఎవరినైతే ఇంటికి రమ్మంటాడో వారిని చేతులు కడుక్కోవాలని, స్ట్రాంగ్ సెంట్లు కొట్టుకుని రాకూడదని చెప్పేవాడు. ఆ వాసనకు తనకు మెలుకువ వస్తుందని జాగ్రత్తపడేవాడు. 2020లో డామినిక్ మహిళల ఛేంజింగ్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెడుతున్నాడన్న అనుమానంతో రావడంతో ఫ్రాన్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలా విచారణ చేపట్టగా ఈ దారుణ విషయాలు బయటపడ్డాయి. విచిత్రం ఏంటంటే.. తనపై పలుమార్లు రేప్ అయిందన్న విషయం డామినిక్ భార్యకు కూడా తెలీదు. ఇలా తన భర్త మరొకరి చేత రేప్‌లు చేయిస్తూ వీడియోలు తీయిస్తున్నాడని పోలీసులు చెప్పడంతో ఆమె షాకైంది. అతనికి విడాకులకు ఇచ్చేసింది.