Viral News: ఫ్రిజ్‌లో నోట్ల కట్టలు
Malaysia: మన దగ్గర డబ్బుల కట్టలు ఉంటే బ్యాంకులో దాచుకుంటాం. కానీ ఓ వ్యక్తి తన దగ్గరున్న డబ్బు కట్టలన్నీ ఫ్రిజ్‌లో పెట్టుకున్నాడు (viral news). ఈ ఘటన మలేషియాలో (malaysia) చోటుచేసుకుంది. ప్రముఖ మలేషియన్ సింగర్ అయిన ఆరిఫ్ బహ్రాన్ ఓ టిక్‌టాక్ వీడియో పోస్ట్ చేసాడు. ఆ వీడియో తన ఇంట్లో ఉన్న ఫ్రిజ్ తెరిచి అందులో దాచి ఉంచిన డబ్బు కట్టలను చూపించాడు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు బిల్‌గేట్స్ కూడా తన దగ్గరున్న డబ్బులు ఇలా ఓవరాక్షన్ చేసి అందరికీ చూపించాలనుకోడు అంటూ నోటికొచ్చినట్లు తిడుతున్నారు. ఈ వీడియోపై ఆరిఫ్ స్పందించాడు. సాధారణంగా తన దగ్గరున్న డబ్బును బ్యాంక్‌లోనే డిపాజిట్ చేస్తానని, టిక్‌టాక్ వీడియో కోసం సరదాగా డబ్బు కట్టలు ఫ్రిజ్‌లో పెట్టానని అన్నాడు. ఇక తనపై ఎన్ని కామెంట్లు చేసినా అస్సలు పట్టించుకోనని, అలా పట్టించుకుంటే బతకలేమని అన్నాడు. ఇప్పటివరకు ఎన్నో ఆల్బమ్స్ రిలీజ్ చేసినా రాని వ్యూస్ ఇలా చెత్త వీడియోలు పోస్ట్ చేస్తుంటే వస్తోందని అంటున్నాడు.