Viral News: రేప్ చేసాడా.. ఏది చూపించు.. న్యాయ‌మూర్తి వికృత ప్ర‌శ్న‌

Viral News: రేప్‌కు గురైన ఓ బాధితురాలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కితే.. న‌లుగురిలో ఆమె ప‌రువు తీసాడు ఓ న్యాయ‌మూర్తి. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లో చోటుచేసుకుంది. మార్చి 30న త‌న వాంగ్మూలాన్ని కోర్టుకు వినిపించేందుకు అత్యాచార బాధితురాలు జ్యుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ కోర్ట‌కు హాజ‌రైంది. వాద‌న‌లు జ‌రుగుతున్న సమ‌యంలో న్యాయ‌మూర్తి ర‌వీంద్ర కుమార్ బాధితురాలిని బోనులోకి పిలిపించి.. రేప్ చేసారా? ఏది దుస్తులు విప్పి ఎక్క‌డ గాయం అయ్యిందో చూపించు అని అడిగాడు. దాంతో పాపం ఆ అమ్మాయితో పాటు అక్క‌డున్న‌వారు కూడా షాక‌య్యారు. ఇలా అంద‌రి ముందు దుస్తులు విప్పి చూపించ‌లేన‌ని.. కావాలంటే మ‌హిళా న్యాయ‌మూర్తి ఉంటే ఆమెకు చూపిస్తాన‌ని చెప్పింది. ఇందుకు ర‌వీంద్ర కుమార్ ఒప్పుకోవ‌డంతో ఆ యువ‌తి అత‌నిపై కేసు వేసింది. ప్ర‌స్తుతం ర‌వీంద్ర కుమార్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేసారు.