Viral News: 28 ఏళ్ల క్రితం చనిపోయిన గేదె.. డ్రైవర్‌కు నోటీసులు!
Uttar Pradesh: ఖర్మ కాని బ్రేకులు పడక ఓ గేదెను (buffalo) ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే చనిపోయింది (viral news) . ఈ ఘటన జరిగి 28 ఏళ్లు కావొస్తోంది. అయితే ఈ కేసులో ఆ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్‌కు ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు రావడంతో అతను తలపట్టుకుని కూర్చున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బరైలీ ప్రాంతానికి చెందిన అచ్చన్ అనే వ్యక్తి యూపీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసేవాడు. 28 ఏళ్ల క్రితం ఓ లోడ్ దించి తిరిగి ఫరీదాబాద్ వెళ్తుంటే.. దారిలో ఓ గేదె అడ్డొచ్చింది. సమయానికి బ్రేకులు పడలేదు. దాంతో ఆ ట్రక్కు గేదెను ఢీకొట్టింది. అది అక్కడికక్కడే చనిపోయింది. పాపం అచ్చన్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో జరిగినదంతా చెప్పాడు కూడా. అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లారట.
అసలు ఈ విషయం ఇప్పుడెందుకు గుర్తొచ్చిందో ఏమో తెలీదు కానీ స్థానిక కోర్టు అచ్చన్‌కు నోటీసులు పంపింది. ఇప్పుడు అచ్చన్ వయసు 85 సంవత్సరాలు. పైగా పక్షవాతం కూడా వచ్చింది. దాంతో నోటీసులు చూసి పోలీసుల ఎదుటే ఏడ్చేసాడు. పోలీసులకు కూడా ఏం చేయాలో తెలీలేదు. చెప్పిన తేదీకి కోర్టుకు రావాలని లేకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పోలీసులు చెప్పి వెళ్లిపోయారు. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ చనిపోయిన గేదె ఇలా వెంటాడుతుందని అనుకోలేదని అచ్చన్ బాధపడుతున్నాడు.