Viral News: అడుక్కుంటూ కోట్లు అర్జిస్తున్న న‌టుడు!

Viral News: బిచ్చ‌గాడు త‌న తెలివి తేట‌ల‌ను ఉప‌యోగించి కోటీశ్వ‌రుడు అవ్వ‌డం సినిమాల్లో చూసాం. కానీ ఓ కోటీశ్వ‌రుడు న‌ష్ట‌పోయి బిచ్చ‌గాడిలా మారి మ‌ళ్లీ కోట్ల‌ను సంపాదించ‌డం ఎక్క‌డైనా చూసారా? ఈ ఘ‌ట‌న చైనాలో చోటుచేసుకుంది. ఇలాంటి వింత ఘ‌ట‌న‌ల‌న్నీ అక్క‌డే జ‌రుగుతాయ‌నుకోండి..! ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. పై ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తిని చూసారా? ఏడుపుగొట్టు ముఖం పెట్టుకుని బిచ్చ‌గాడిలా ఎంతో వికారంగా క‌నిపిస్తున్నాడు క‌దూ..! నిజానికి ఇత‌ను బిచ్చ‌గాడు కాదు. చైనాలో రిచెస్ట్ వ్య‌క్తి. కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల బిచ్చ‌గాడిలా మారాల్సి వ‌చ్చింది.

లు జిన్‌జాంగ్ అనే వ్యక్తి చైనాలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌లేక సులువైన మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే బిచ్చం ఎత్తుకోవ‌డం. దాదాపు 12 ఏళ్లుగా చైనాలోని పాపుల‌ర్ ఏరియాలు, రెస్టారెంట్లు, ప‌బ్స్ ఇలా కాస్త డ‌బ్బున్న జ‌నాలు వ‌చ్చే ప్ర‌దేశాల్లో అడుక్కుంటున్నాడు. పాపం ఏదో పొట్ట కూటి కోసం అడుక్కుంటున్నాడు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? నాలుగు రూపాయ‌లు సంపాదించుకుని ఆ పూట‌కు క‌డుపు నింపుకుంటుంటే ఫ‌ర్వాలేదు. కానీ ఇత‌ను నెల‌కు ఏకంగా రూ.8 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నాడంటే న‌మ్ముతారా? కానీ ఇది అక్ష‌రాలా నిజం. (Viral News)

ALSO READ: Telangana కు ఒక్క నెల‌లో రూ.157 కోట్ల సైబ‌ర్ పంగ‌నామాలు..!

ఇంత‌కీ ఇత‌ను కేవ‌లం అడుక్కుంటూనే ఇంత ఎలా సంపాదిస్తున్నాడు అనేగా మీ సందేహం. ఉద‌యాన్నే ముఖానికి మ‌సి పూసుకుని చిరిగిన దుస్తులు వేసుకుని బొచ్చె ప‌ట్టుకుని ప్ర‌పంచంలో ఎవ్వ‌రికీ లేని బాధ త‌న‌కు ఒక్క‌డికే ఉన్న‌ట్టు ముఖం పెట్టి మ‌రీ అడుక్కుంటాడు. అదే ఇత‌ని ట్యాలెంట్. ఈ ట్యాలెంట్‌తోనే లక్ష‌లు సంపాదిస్తున్నాడు. చైనాలో అత్య‌ధికంగా సంపాదిస్తున్న‌ట్లు స‌గ‌టు వ్య‌క్తి కూడా ఇత‌నే అంటే న‌మ్ముతారా? చైనాలో స‌గ‌టు వ్య‌క్తికి ల‌భించే జీతం నెల‌కు రూ.3 ల‌క్ష‌లు. ఆ ర‌కంగా చూసుకుంటే ఈ బిచ్చ‌గాడు రూ.8 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నాడు. డ‌బ్బుతో పాటు ఆహారానికి ఆహారం, దుస్తుల‌కు దుస్తులు ల‌భిస్తున్నాయి.

ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఇత‌ను చైనాలోనే రిచెస్ట్ బిచ్చ‌గాడు. అయితే ఈ వ్య‌క్తి చేస్తోంది మోసం అనుకోవ‌డానికి కూడా లేదు. ఇత‌నికి న‌ట‌న అంటే చాలా ఇష్టం. అలాగ‌ని సినిమాల్లో ప్ర‌య‌త్నించ‌లేక‌పోయాడు. కనీసం నిజ జీవితంలో అయినా న‌టించి దాని ద్వారా డ‌బ్బులు సంపాదించాల‌నుకున్నాడు. అందుకే బిచ్చ‌గాడి కెరీర్‌ను ఎంచుకున్నాన‌ని తానే చెప్తున్నాడు. సాధార‌ణంగా యాక్టింగ్ రంగంలోకి వెళ్లాలంటే చాలా క‌ష్టం. కాంటాక్ట్స్ ఉన్నప్ప‌టికీ న‌ట‌న రాక‌పోతే ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేరు. క‌చ్చితంగా ఆడిష‌న్స్‌లో పాల్గొనాల్సిందే. అయితే లీకి ఆడిష‌న్స్ ఇవ్వ‌డం కూడా క‌ష్ట‌మ‌య్యేది. అడుక్కోవ‌డానికి అయితే ఎలాంటి ఆడిష‌న్ అవ‌స‌రం ఉండ‌దు క‌దా..! అందుకే అత‌ను ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఇలా అడుక్కుంటానంటే ఇంట్లో ఎవ‌రు మాత్రం ఒప్పుకుంటారు? లీకి కూడా ఇంట్లో వారి నుంచి స‌పోర్ట్ దొర‌క‌లేదు. కావాలంటే ఇల్లు వ‌దిలేసి వెళ్లిపో కానీ ఇలా అడుక్కుంటూ త‌మ ప‌రువు తీయొద్దు అని చెప్పేసారు. అయినా స‌రే త‌న‌కు అడుక్కుంటున్న‌ట్లు న‌టించ‌డం ఇష్టం కావ‌డంతో 12 ఏళ్లుగా దీనినే త‌న కెరీర్‌గా మ‌లుచుకున్నాడు.