బ్యాంక్‌లో సాంకేతిక లోపం.. రూ.300 కోట్లు విత్‌డ్రా చేసుకున్న కస్టమర్లు
Viral News: ఓ బ్యాంకులో తలెత్తిన సాంకేతిక లోపంతో దొరికిందే సందు అని కస్టమర్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.300 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ ఘటన ఇథియోపియాలోని సెంట్రల్ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. సెంట్రల్ బ్యాంక్‌కు సంబంధించిన సిస్టమ్‌లో మార్పులు చేపడుతున్న సమయంలో ఓ కోడ్ మిస్సయిందని దాని వల్ల ఈ సాంకేతిక లోపం తలెత్తిందని బ్యాంక్ ప్రెసిడెంట్ అబే సానో తెలిపారు. ఇందులో ఎలాంటి సైబర్ ఎటాక్ జరగలేదని వెల్లడించారు.
ఎప్పుడైతే బ్యాంకింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తిందో అప్పుడు తమకు తెలియరాలేదని.. ఈ గ్యాప్‌లో దాదాపు 66 వేల మంది విద్యార్ధులు ఏటీఎంల చుట్టూ క్యూ కట్టి మరీ 23 వేల ట్రాన్‌సాక్షన్లు చేసారని తెలిపారు. అలా మొత్తం దాదాపు రూ.300 కోట్ల వరకు డబ్బులు విత్‌డ్రా అయినట్లు పేర్కొన్నారు. కస్టమర్లలో ఎక్కువగా విద్యార్ధులే ఉన్నారని వారంతట వారే డబ్బులు తిరిగి ఇచ్చేస్తే ఎలాంటి కేసులు పెట్టమని చెప్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా ఈ బ్యాంక్‌కు సంబంధించిన లావాదేవీలను ఆపేసినట్లు తెలిపారు. అయితే డబ్బులు విత్‌డ్రా చేసుకున్న విద్యార్ధులు తిరిగి ఆ డబ్బులు ఇచ్చేసారా లేదా అనేది తెలియాల్సి ఉంది.