Viral News: చిన్నారికి వింత వ్యాధి.. సోఫాలు, గాజు సీసాలు తినేస్తోందట
Viral News: ఓ మూడేళ్ల చిన్నారికి వింత వ్యాధి సోకింది. తినకూడని వస్తువులను తినేస్తోందట. దాంతో ఆ కన్నతల్లి తెగ బాధ పడుతోంది. వివరాల్లోకెళితే.. యూకేకి చెందిన స్టేసీ అనే 25 ఏళ్ల యువతికి పండంటి ఆడపిల్ల పుట్టింది. రెండేళ్ల వరకు పాప ఆరోగ్యంతో బాగానే ఉంది. కానీ పాపకు ఎప్పుడైతే మూడేళ్లు వచ్చాయో ఆటిజం బారినపడింది. అమెరికా, బ్రిటన్‌లోని ప్రతి ఐదుగురు చిన్నారుల్లో నలుగురికి ఆటిజం సమస్య వస్తోంది. అయితే ఇక్కడ స్టేసీ కూతురికి అసలు సమస్య ఆటిజం కాదు.
ఆమె కూతురు పికా అనే డిజార్డర్‌తో బాధపడుతోంది. ఈ పికా వ్యాధి సోకిన పిల్లలు తినకూడని వస్తువులను తినేస్తుంటారు. సోఫాలోని స్పాంజ్.. గాజు ముక్కులు, పరుపు ఇలా ఇంట్లోని వస్తువులను నములుతూ ఉంటారు. ఈ సమస్య స్టేసీ కుమార్తెకు ఎంత తీవ్రంగా ఉందంటే నెల రోజుల్లో ఇల్లు మొత్తం తినేస్తుందేమో అని భయపడుతోంది. ఈ సమస్యకు చికిత్స ఉన్నప్పటికీ దానికి తన వద్ద డబ్బులు లేవని ఆ కన్న తల్లి విలపిస్తోంది.