Viral News: 104 ఏళ్ల అమ్మమ్మతో 48 మనవడి డేటింగ్
Viral News: ప్రేమ గుడ్డిది అంటుంటారు కానీ అసలు ప్రేమకు కళ్లు లేవు అనే చెప్పాలి వీరి జంటను చూస్తే. లేకపోతే.. 104 ఏళ్ల బామ్మతో 48 ఏళ్ల మనవడు డేటింగ్ చేయడం ఏంటి..!
ఈ ఘటన యూరప్‌లోని ఎస్టోనియాలో చోటుచేసుకుంది. ఎస్టోనియాకు చెందిన మార్ట్ అనే 48 ఏళ్ల వ్యక్తి లాయర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ఆస్ట్రేలియాలో నివసిస్తున్న 108 ఏళ్ల అమ్మమ్మతో డేటింగ్‌లో ఉన్నాడు. 2013లో తన తాతయ్య చనిపోవడంతో ఆయనకు రెండో భార్య అయిన ఎల్‌ఫ్రిదేతో మార్ట్ ప్రేమలో ఉన్నాడు. తాతయ్య చనిపోయినప్పి నుంచి తనకు అమ్మమ్మపై ప్రేమ పెరిగిపోయిందని.. అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నామని మార్ట్ తెలిపాడు.
చాలా ఏళ్ల గ్యాప్ ఉన్నా కూడా తనపై ప్రేమ అంతే ఉందని మార్ట్ చెప్పాడు. అయితే మార్ట్.. తన బామ్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పి ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్నాడట. కానీ అది కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయ్యింది. దాంతో పీఆర్ కోసమే మార్ట్ ఈ నాటకం ఆడుతున్నాడమో అని స్థానిక అధికారులు భావించి ఆ బామ్మను కేర్ సెంటర్‌కు తరలించారు.
ALSO READ