టీచర్ ఫోన్ లాక్కుందని.. 19 మంది ప్రాణాలను బలిగొన్న బాలిక!
Guyana: టీచర్ తన ఫోన్ లాక్కుందని ఏకంగా 19 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది ఓ 14 ఏళ్ల బాలిక (viral news). ఈ ఘటన సౌత్ అమెరికా (south america) దేశం అయిన గుయానాలో (guyana) చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం గుయానాలోని మహ్దియా సెకండరీ స్కూల్ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న 19 మంది పిల్లలు సజీవదహనం అయ్యారు. ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టగా ఈ ప్రమాదానికి కారణం ఓ 14 ఏళ్ల బాలిక అని తేలింది (viral news).
అదే స్కూల్‌లో చదువుతున్న ఆ బాలిక తన కంటే వయసులో పెద్దవాడైన ఓ వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. తనకు ఎలాగైనా బుద్ధిచెప్పాలని టీచర్ ఫోన్ లాక్కుంది. కోపంతో హాస్టల్‌లోని ఓ బెడ్‌షీట్‌కి అగ్గిపెట్టతో నిప్పు అంటించింది. కొద్దిసేపటికే హాస్టల్ అంతా నిప్పంటుకుంది. దాంతో భయపడిన ఆ బాలిక వాష్‌రూంలోని కిటికీ నుంచి కేకలు వేసింది. హాస్టల్ వార్డెన్ భయాందోళనకు గురికావడంతో పిల్లలు పడుకున్న గదుల తాళాలు మర్చిపోయింది. దాంతో మంటలు ఎక్కువై దాదాపు 19 మంది పిల్లలు సజీవదహనమయ్యారు. ఈ దారుణానికి కారణం అయిన బాలికను జువెనైల్ హోంకు తరలించారు. ఈ ఘటనతో సౌత్ అమెరికాలో విషాదఛాయలు అలుముకున్నాయి. అక్కడి ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది.