Virat Kohli ఫ్యాన్స్ అరిస్తే ఇంకా బాగా ఆడతా
Hyderabad: ఆర్సీబీ (rcb) కెప్టెన్ విరాట్ కోహ్లీ (virat kohli) ఫ్యాన్స్ అతని పేరుతో అరుస్తుంటే.. తనకు కిక్ వస్తుందని అప్పుడు ఇంకా బాగా ఆడతానని అంటున్నాడు ఎస్ఎస్జీ (lsg) పేసర్ నవీన్ ఉల్ హక్ (naveen ul haq). కొన్ని రోజుల క్రితం జరిగిన RCB వర్సెస్ LSG మ్యాచ్‌లో లఖ్నౌ సూపర్ జైంట్స్ (lucknow super giants) మెంటార్ గౌతమ్ గంభీర్ (gautam gambhir).. విరాట్ ఫ్యాన్స్‌ని నోరుమూసుకోండి అని సైగ చేయడం, ఆ తర్వాత విరాట్ లఖ్నౌ వికెట్ తీసినప్పుడు అదే విధంగా సైగలు చేయడంతో రెండు టీంల మధ్య వివాదం చోటుచేసుకుంది. అప్పటినుంచి ఎప్పుడెప్పుడు ఆర్సీబీ ఓడిపోతే వెక్కిరిద్దామా అని నవీన్ ఉల్ హక్ ఎదురుచూస్తున్నాడు. మొన్న గుజరాత్ టైటాన్స్ (gujarat titans) చేతిలో RCB ఓడిపోయినప్పుడు కూడా పగలబడి నవ్వుకుంటున్నట్లు నవీన్ ఇన్‌స్టాలో పెట్టిన స్టోరీ వైరల్ అయింది.
నిన్న జరిగిన LSG వర్సెస్ MI మ్యాచ్‌లో కూడా నవీన్ ఇలాగే ప్రవర్తించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ .. LSGను 81 పరుగుల తేడాతో ఓడించింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (rohit sharma) ఆడుతున్నప్పుడు ఫ్యాన్స్ అంతా రోహిత్ పేరును అరుస్తుండగా.. రోహిత్ అవుట్ అయిపోయాడు. ఆ సమయంలో నవీన్ చెవులు మూసుకుని తన జెర్సీని చూపిస్తూ ఎంజాయ్ చేసాడు. దీని గురించి మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. “నేను ఆడుతున్నప్పుడు ఫ్యాన్స్ ఏ క్రికెటర్ పేరును అరిచినా నేను ఎంజాయ్ చేస్తాను. ఆ అరుపులు నన్ను మరింత బాగా ఆడేలా చేస్తాయి. అంతేకానీ ఆ అరుపులకు భయపడి నేను సైలెంట్‌గా ఉండను” అని తెలిపాడు.