“జాబ్ కావాలి స‌ర్.. లేదంటే నా చిన్న‌నాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకోలేను”

i need this job because i cannot marry my childhood love without it

Viral News: ఉద్యోగ య‌త్నాల్లో భాగంగా రెజ్యూమే, క‌రిక్యుల‌మ్ వీటేల‌లో మ‌న‌కు సంబంధించిన ఎన్నో నైపుణ్యాల‌ను క‌న‌బ‌ర‌చాల‌ని అనుకుంటాం. రెజ్యూమ్ చూడ‌గానే ఉద్యోగం వ‌చ్చేయాల‌ని అనే రేంజ్‌లో కొంద‌రు రెజ్యూమ్‌ల‌ను త‌యారుచేస్తుంటారు. అయితే ఓ వ్య‌క్తి మాత్రం త‌న రెజ్యూమ్‌లో త‌న ప్రేమ విష‌యాన్ని మెన్ష‌న్ చేసాడు. దాంతో ఆ హెచ్ఆర్‌కి న‌వ్వాలో ఏడ‌వాలో అర్థంకాలేదు.

ఆర్వా హెల్త్ కంపెనీకి చెందిన ఓ హెచ్ఆర్ జాబ్ అప్లికేష‌న్లు ప‌రిశీలిస్తుండ‌గా ఓ వ్య‌క్తికి సంబంధించిన అప్లికేష‌న్ ఫాం ఆయ‌న‌కు ఆస‌క్తిక‌రంగా క‌నిపించింది. అప్లికేష‌న్ ఫాంలో ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అని ఎందుకు అనుకుంటున్నారు? అనే ప్ర‌శ్న ఉంది. ఆ ప్ర‌శ్న‌కు ఓ వ్య‌క్తి ఇలా స‌మాధానం ఇచ్చాడు. ఈ పొజిష‌న్‌కి కావాల్సిన అన్ని నైపుణ్య‌లు నాకు ఉన్నాయి. నేను ప‌ర్ఫెక్ట్ అని నాకు వంద శాతం అనిపిస్తోంది. ఇక‌పోతే.. ఈ ఉద్యోగం నాకు రాక‌పోతే నేను నా చిన్న‌నాటి స్నేహితురాల‌ని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే వాళ్ల నాన్న నాకు ఉద్యోగం లేక‌పోతే త‌న కూతురిని ఇచ్చి పెళ్లి చేయ‌ను అంటున్నాడు అని రాసాడు. అది చూసిన హెచ్ఆర్ వెంట‌నే ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు.