HYDRAA: రియ‌ల్ ఎస్టేట్‌కి కొత్త రూల్

hydraa noc is mandate in real estate now

Hydraa: రియ‌ల్ ఎస్టేట్ రంగంలో హైడ్రా కొత్త వ‌ణుకుగా మారింది. బ‌ఫ‌ర్ జోన్ల‌లో, ఫుల్ ట్యాంక్ లెవెల్స్‌లో చెరువుల‌ను ఆక్ర‌మించి మ‌రీ నిర్మిస్తున్న క‌ట్టడాల‌పై హైడ్రా క‌మిష‌నర్ ఏవీ రంగ‌నాథ్ కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. ఇప్ప‌టికే సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు చాలా నిర్మాణాల‌ను కూల్చివేసారు. దాంతో ఇప్పుడు తెలంగాణ‌లో హైడ్రా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

భ‌విష్య‌త్తులో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త రూల్‌ని ప్ర‌వేశ‌పెట్టే యోచ‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ఉంది. వారంతా ఏదైనా నిర్మాణాలు చేప‌ట్ట‌డానికి ముందు హైడ్రా నుంచి నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికేట్ (NOC) తీసుకోవాల్సిందే. ఈ స‌ర్టిఫికేట్ లేకుండా నిర్మాణాలు చేపడితే అవి అమ్మ‌డానికి, కొన‌డానికి చెల్ల‌వు. ఇలాంటి కేసులు హైడ్రా దృష్టికి వ‌స్తే మాత్రం వెంట‌నే నోటీసులు కూడా జారీ చేయ‌కుండా కూల్చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. ఇప్ప‌టికే ఇలాంటి అక్ర‌మ నిర్మాణాల కేసుల‌ను ప‌రిశీలించేందుకు హైడ్రా కోసం ప్ర‌త్యేక పోలీస్ స్టేష‌న్‌ను కూడా ఏర్పాటుచేసారు.