కూల్చేయండి..హైడ్రాకు కోర్ట్ గ్రీన్ సిగ్నల్
Hydra: తెలంగాణ హైకోర్టు హైడ్రా సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 191ను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు చేస్తూ హైడ్రాకు స్పెషల్ పవర్స్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఉత్తర్వులు ఈరోజు నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్లో నేటి నుంచి హైడ్రా డైరెక్షన్లోనే నోటీసులు జారీ అవుతాయి. బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా పనిచేయనుంది. ఇప్పటికే హైడ్రా విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలను అడ్డుకోబోమని హైకోర్టు వెల్లడించింది.