America వీధుల్లో అల్లాడుతున్న హైదరాబాద్ యువతి
Hyderabad: ఓ హైదరాబాదీ యువతి అమెరికా (america) వీధుల్లో ఆకలికి అలమటిస్తోంది. తిండి లేక ఉండటానికి ఇల్లు లేక వీధుల్లోనే తిరుగుతూ షాపుల బయట పడుకుంటోంది. దాంతో ఆ యువతి తల్లి కేంద్ర ప్రభుత్వాన్ని సాయం అడిగింది. 2021లో మౌలాలికి చెందిన సయ్యదా లులు అనే యువతి అమెరికాలోని చికాగోలో మాస్టర్స్ చేయడానికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక రోజూ తన కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. అయితే రెండు నెలలుగా సయ్యదా నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదట. తమ బిడ్డ ఏమైపోయిందో తెలీక తల్లిదండ్రులు బాధపడుతున్నారు. చికాగోలో ఉన్న మరో ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా సయ్యదా ఆచూకీ తెలిసిందట. రెండు నెలల క్రితం సయ్యదా దగ్గర ఉన్న డబ్బు, వస్తువులను దొంగలు దోచుకున్నారని దాంతో ఆమె వీధుల్లో తిరుగుతూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని చెప్పారు. దాంతో సయ్యదా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెంటనే తమ బిడ్డను తిరిగి హైదరాబాద్ రప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసారు. సయ్యదా తల్లిదండ్రులు రాసిన లెటర్‌ను ఓ జర్నలిస్ట్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.