Hyderabad: కూతురితో తండ్రి అసభ్య ప్రవర్తన.. నరికి చంపిన భార్య
Hyderabad: తాగి కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించిన భర్తను గొడ్డలితో నరికి చంపింది భార్య. ఈ ఘటన హైదరాబాద్‌లోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సుల్తాన్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తి నిన్న రాత్రి తాగి కన్న కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన భార్య కోపంతో గొడ్డలితో నరికి చంపింది. దాంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు.