Hyderabad: రూ.50కి నిబ్బి వీడియో అంటూ ప్రచారం.. పట్టుకున్న పోలీసులు
ట్విట్టర్లో మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తూ 50 రూపాయలు ఫోన్ పే చేయాలని డిమాండ్ చేస్తున్న భూక్యా రమేష్ అనే యువకుడిని హైదరాబాద్ (hyderabad) పోలీసులు అరెస్ట్ చేసారు. లేత నిబ్బి వీడియోలు ఉన్నాయని ఎవరికైనా ఫుల్ లింక్ కావాలంటే కింది నెంబర్‌కు రూ.50 ఫోన్ పే చేయండి అని పబ్లిక్‌గా కామెంట్స్ పెడుతున్నాడు. దాంతో కొందరు నెటిజన్లు ఇతనిపై కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేసారు.