EXCLUSIVE: అయోధ్య రామ‌య్య‌కు హైద‌రాబాద్ నుంచి 8 అడుగుల ముత్యాల హారం

EXCLUSIVE: హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన ముత్యాల వ్యాపారి వెంకటదాసు అయోధ్య రాముడి కోసం 8 అడుగుల పొడ‌వైన ముత్యాల హారాన్ని త‌యారుచేసారు. పెర్ల్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నుంచి అయోధ్య రాముడికి ముత్యాల హారం చేరనుంది. ఈ గ‌జ మాల త‌యారు చేయ‌డానికి 9 రోజులు ప‌ట్టింది. దీని బరువు నాలుగున్న‌ర కిలోలు ఉంది.ముత్యాల హారం నుంచి చంద‌న‌పు ప‌రిమ‌ళం వ‌చ్చేలా డిజైన్ చేసారు. ఐదు అడుగుల బ‌ల‌రాముడికి ఈ దండ‌ను వేయ‌నున్నారు. త్రిదండి శ్రీమ‌న్నారాయ‌ణ రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారి చేతుల మీదుగా దీనిని అయోధ్య‌లో అందించ‌నున్నారు.