Hyderabad: మన నగరంలో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారో తెలుసా?
తెలంగాణలో (telangana) రాష్ట్రంలో దాదాపు 100 మంది అత్యధిక ధనవంతులు ఉన్నారట. అందులో 94 మంది రాజధాని హైదరాబాద్‌కు (hyderabad) చెందినవారే. ఈ వివరాలను హురున్స్ ఇండియా వెల్త్ రిపోర్ట్ సంస్థ బయటపెట్టింది. ఈ ధనవంతుల్లో ఒకరు ఖమ్మంకు చెందినవారిగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరికి దాదాపు రూ.1000 కోట్ల పైమాటే ఆస్తులు ఉంటాయని హురున్ నివేదిక వెల్లడించింది.
టాప్ 5 ధనవంతులు వీరే..
దివి ల్యాబ్స్ (divi labs) అధినేత మురళీ దివి (murali divi) – రూ.55,700 కోట్లు. ఈయన తెలంగాణలోనే అత్యధిక ధనవంతుడు.
మేఘా ఇంజినీరింగ్ సంస్థల అధినేత పిచ్చి రెడ్డి – 35, 800 కోట్లు
పీ వీ కృష్ణా రెడ్డి – 35, 800 కోట్లు
పార్థసారథి రెడ్డి – 21,900 కోట్లు
జూపల్లి రామేశ్వరరావు – 17,500 కోట్లు
ఈ 95 మంది ధనవంతుల ఆస్తుల మొత్తం విలువ 4,98,000 కోట్లు. ఈ ఐదుగురి ఆస్తులను కలిపితే రాష్ట్రంలోని అందరి డబ్బులను పోగేసి చూస్తే అందులోని 1/3 శాతం ఆస్తి వీరి వద్దే ఉన్నట్లు లెక్క. ఈ ఐదుగురి ఆస్తులను కలిపితేనే 1,68,200 కోట్లు ఉంటుంది. ఇక మిగతా 89 మంది ఆస్తులను కలిపితే 3,29,800 కోట్లు.
హైదరాబాద్‌ను (hyderabad) ఐటీ హబ్ అంటారు కానీ నిజానికి హైదరాబాద్‌లో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నది ఫార్మా సెక్టారే. దీని నుంచే ఆర్థిక లాభాలు గణనీయంగా పెరుగున్నాయి. ఈ కోటీశ్వరుల్లో 23 మంది ఫార్మా రంగంలోనే పెట్టుబడులు పెట్టారు. ఈ 23 మంది ఆస్తులు కలిపితే 1,88,600 కోట్లు ఉంటుంది. ఫార్మా తర్వాత సిమెంట్, నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఇక ఐటీ సెక్టార్ నుంచి కేవలం ఏడుగురు కోటీశ్వరులు మాత్రమే ఉన్నారు. వారి ఆస్తులన్నీ కలిపితే 21,500 ఉంటుంది.