Fake Job: భార్యను ఇంప్రెస్ చేయాలనుకుని.. దొరికిపోయాడు
Hyderabad: ఓ వ్యక్తి తన భార్యను ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. చివరికి దొరికిపోయి పోలీస్ స్టేషన్‌లో ఇరుక్కున్నాడు (fake job). అహ్మదాబాద్‌లో ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. గాంధీ నగర్‌కు చెందిన గుంజన్ కాంతియా అనే 31 ఏళ్ల వ్యక్తి వీసా కన్‌సల్టెన్సీని నడుపుతుంటాడు.. కానీ తన భార్యకు మాత్రం NIA సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని చెప్పి బిల్డప్ ఇచ్చాడు. అయితే అతని భార్య నమ్మలేదు. ఎలాగైనా తన భార్యను నమ్మించి బిల్డప్ ఇవ్వాలనుకున్నాడు కాంతియా.
షాపింగ్‌కి వెళ్దాం అని చెప్పి దారిలో NIA ఆఫీస్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్లి వస్తాను చూడు అని సవాల్ విసిరాడు. కాంతియా భార్య కూడా ఓకే అనింది. అలా స్థానిక జగత్‌పూర్‌లో ఉన్న NIA ఆఫీస్‌లోకి వెళ్లాడు. అక్కడి కొందరు అధికారులు అతనిపై అనుమానంతో ఐడీ కార్డు చెక్ చేస్తే అది ఫేక్ అని తెలిసింది. దాంతో లోపలికి వెళ్లిన కాంతియా నేరుగా పోలీస్ స్టేషన్‌లో పడ్డాడు. కాంతియా భార్య అతని కోసం ఎదురుచూస్తూ కారులోనే గంటన్నర సేపు కూర్చుండిపోయింది. అసలు విషయం తెలిసాక నవ్వాలో ఏడ్వాలో తెలీలేదు. (fake job)
NIAకి చెందిన ఉన్నత అధికారులకు సంబంధించిన లోగోలు, సంతకాలను ఫోర్జనీ చేసి నాలుగు, ఐదు ఫేక్ ఐడీ కార్డులను తయారుచేసి పెట్టుకున్నాడు. ఈ కార్డులను ఉపయోగించి ఎన్నోసార్లు ఉచితంగా ప్రభుత్వ గెస్ట్ హౌసులను వాడుకున్నానని పోలీసులకు తెలిపాడు. ఈ కార్డుల ద్వారా తన కన్‌సల్టెన్సీకి వీసాల కోసం వచ్చే వారి నుంచి డబ్బు తీసుకుని వారి పనులు చేసి పెట్టేవాడినని నిజం ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. అలా భార్య ముందు బిల్డప్ ఇవ్వాలనుకుని చివరికి లాకప్‌లో పడ్డాడు. (fake job)