ఇన్‌స్టాగ్రామ్ వాడొద్దన్న భర్త.. భార్య ఆత్మహత్య
Instagram: భార్య ఇన్‌స్టాగ్రామ్ వాడుతోందని తెలిసి వద్దని భర్త వారించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకుని నోయిడాలోని సర్దార్‌పూర్ కాలనీలో నివసిస్తున్న ఓ జంట.. నిన్న రాత్రి ఇన్‌స్టాగ్రామ్ విషయంలో గొడవపడ్డారు. భార్య ఇన్‌స్టాగ్రామ్ వాడుతోందని తెలిసి వాడొద్దని వారించాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ చోటుచేసుకుంది. బాధతో ఆ మహిళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.